బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా ముంబైలోని ఆయన ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు చెక్ చేశారు. గురువారం తెల్లవారుజామున 2:30 సమయంలో కత్తితో దాడి చేశాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్న పోలీసులు… అంతకుముందు రెండు గంటలు లోపల ఎవరూ ఆ సొసైటీలోకి వెళ్లలేదని ప్రాథమిక విచారణలో తేల్చారు. సైఫ్ అలీఖాన్ ఉంటున్న సొసైటీలో ఆ దుండగుడు ముందే ఉన్నట్లు పోలీసులు అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
Also Read : ఇళ్ళు పంచేద్దాం.. టిడ్కో పై బాబు దూకుడు…!
ఈ దాడిలో సైఫ్ ఇంట్లో పనిచేసే మహిళ సిబ్బంది కూడా పలు గాయాలయ్యాయి. సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిన తర్వాత మూడు గంటలకు పోలీసులకు సమాచారం వెళ్ళింది. వెంటనే సీనియర్ అధికారుల బృందం అక్కడికి చేరుకొని ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. సైఫ్ అలీ ఖాన్ సొసైటీ లోని సిబ్బంది లోనే ఒక దుండగుడు ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ కు చెందిన ఐదుగురు సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Also Read : ఒక్కొక్కడి అంతు చూస్తా.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..!
ఇక సొసైటీ గార్డు కూడా ఎవరిని చూడలేదని చెప్తున్నాడని తెలుస్తోంది. దొంగతనం కోసం ఈ దాడి జరిగిందా అనేది స్పష్టత రావడం లేదు నిందితుడు ముందు సైఫ్ కుమారుడు జెహ్ గదిలో నక్కి ఉన్నట్టు ముంబై లోకల్ మీడియా వెల్లడించింది. సైఫ్ కుమారుడి కేర్ టేకర్ అతనిని గమనించి కేకలు వేయగా హడావుడిగా సైఫ్ అలీ ఖాన్ అక్కడికి చేరుకోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ కు ఆరు చోట్ల కత్తి గాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.




