Friday, September 12, 2025 08:38 PM
Friday, September 12, 2025 08:38 PM
roots

20 రోజులే టైమ్.. గుర్తుపెట్టుకో..!

ఏపిలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రతిపక్షం ఉంటూ కూడా అధికార టిడిపి నాయకుల పై విరుచుకుపడుతున్న మాజీ ఎమ్మెల్యే రోజా రెడ్డి కి టైం దగ్గరపడుతున్నట్లు తెలుస్తుంది. నీకు ఉన్నది 20 రోజులే.. గుర్తు పెట్టుకో.. అంటూ వైసీపీ మాజీ మంత్రికే వార్నింగ్ ఇచ్చారు శాప్ ఛైర్మన్ రవి నాయుడు. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజాపై ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ.. శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పర్యాటక, క్రీడా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రోజా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు రవినాయుడు ఆరోపించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా దాదాపు 200 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు రవి నాయుడు ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే లోతైన దర్యాప్తు జరుగుతోందని.. మరో 20 రోజుల్లోనే రోజా అరెస్టు ఖాయమన్నారు రవి నాయుడు. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలను రోజా వెనకేసుకున్నారన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన అవినీతిలో శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ద రెడ్డి కూడా ఉన్నారన్నారు. వైసీపీ హయాంలో క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదని.. ఆడుదాం ఆంధ్ర అని పేరు పెట్టి ఆంధ్రను దోచుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా.

Also Read : ఎవరి కొడుకైనా టాలెంట్ ఉండాల్సిందే.. పవన్ సంచలన కామెంట్స్

వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర నిర్వహించినప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి. క్రీడాకారుల ఎంపిక నుంచి ఆట వస్తువుల కొనుగోలు వరకు అన్ని అంశాలు వివాదాస్పదమయ్యాయి. ఆడుదాం ఆంధ్ర కోసం వైసీపీ ప్రభుత్వం సుమారు 400 కోట్లు ఖర్చు చేసినట్లు అప్పట్లో వెల్లడైంది. ఏపీలో అత్యుత్తమ క్రీడాకారులను ప్రొత్సహించేందుకే ఆడుదాం ఆంధ్ర నిర్వహిస్తున్నట్లు అప్పట్లో వైసీపీ సర్కార్ పెద్దలు గొప్పగా ప్రకటించారు. అయితే క్రీడాకారుల ఎంపిక కోసం ఏకంగా మంత్రులే పైరవీలు చేశారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి కూడా. టీమ్ సెలక్షన్ విషయంలో కూడా రాజకీయాలు చేశారనేది ప్రధాన ఆరోపణ. అలాగే నాసిరకం ఆట వస్తువులను భారీ ఎత్తున ఖర్చు చేశారు కూడా. ఇందుకోసం ఆయా తయారీ సంస్థల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారనేది శాప్ ఛైర్మన్ రవి నాయుడు ఆరోపణ. మద్యం కుంభకోణం మాదిరిగానే ఆడుదాం ఆంధ్ర పేరుతో వందల కోట్లు వెనుకేసుకున్నారన్నారు రవి నాయుడు.

Also Read : వివేకా కేసు.. సెన్సేషనల్ క్రియేట్ చేయబోతుందా..?

ఆడుదాం ఆంధ్ర కేసులో అంతర్గత విచారణ జరుగుతోందని.. త్వరలోనే ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులపై చర్యలు ప్రారంభిస్తామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పైన నోటికి వచ్చినట్లు రోజా రెచ్చిపోయారన్నారు. తాను చేసిన అవినీతి ప్రశ్నిస్తే.. వారిపై అప్పట్లో కేసులు పెట్టారని.. కానీ ఇప్పుడు అదే అవినీతి కేసులో రోజా అరెస్టు ఖాయమన్నారు. మరో 20 రోజుల్లోనే రోజా అరెస్టుకు వారెంటు జారీ అవుతుందన్నారు రవి నాయుడు. జైలుకు వెళ్లేందుకు రోజా రెడీగా ఉండాలంటూ సెటైర్లు వేశారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. రోజాతో పాటు సిద్ధార్థ రెడ్డి, మరికొందరు నేతలు, అధికారులు కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు శాప్ ఛైర్మన్ రవి నాయుడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్