Wednesday, October 22, 2025 02:07 AM
Wednesday, October 22, 2025 02:07 AM
roots

లిక్కర్ స్కామ్ ని మించిన మరో కుంభకోణం బయటపెట్టిన ఏబివి

దిల్లీ లిక్కర్ స్కామ్‌ (₹300 కోట్లు) ఎపిసోడ్స్ చూసిన ప్రజలు, దానికి పది రెట్లు అంటే ₹3,000 కోట్ల ఏపీ లిక్కర్ స్కామ్‌ వార్తలు వింటే పెద్ద ఊహాగానాలకే లోనయ్యారు. అయితే ఇప్పటి వరకూ “ఇంటర్వెల్ బ్యాంగ్” మాత్రం రాలేదు. వస్తుందో లేదో కూడా స్పష్టంగా తెలియదు.

అయితే, శనివారం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు మాత్రం మరో బాంబు పేల్చారు. ఆయన ప్రకారం, గత ప్రభుత్వ కాలంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు, పెట్టుబడుల పేరుతో గుట్టుగా సుమారు ₹40,000 కోట్ల భారీ విద్యుత్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇది బయటపడితే, లిక్కర్ స్కామ్‌ (₹3,000 కోట్లు) చిన్నదైపోతుందని వ్యాఖ్యానించారు.

Also Read : విజయవాడ ఉత్సవ్.. ఖర్చు వంద కోట్లా..?

ఈ కుంభకోణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఒకవేళ నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధమని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం విచారణకు ఆదేశించి, గత ప్రభుత్వంలో ఇచ్చిన విద్యుత్ టెండర్లన్నీ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్కామ్ వెనుక ఉన్న పెద్దల పేర్లు బహిర్గతం చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

గత ప్రభుత్వ హయంలో అదానీ విద్యుత్ కంపెనీ పేరు కూడా వినిపించిందని ఆయన గుర్తుచేశారు. అమెరికాలో మొదలైన పరిణామాలు ఆంధ్రా వరకు చేరినట్లు చెప్పబడింది. కాబట్టి ఈ ₹40,000 కోట్ల స్కామ్‌ ప్రత్యేకంగా అదానీకే సంబంధించినదా? లేక విద్యుత్ రంగంలో అనేక అంశాలు కలిపి మొత్తం అంత డబ్బు అక్రమాలకి లోనయ్యాయా? అనేది మున్ముందు స్పష్టమవుతుంది.

Also Read : సంచలనం.. తిరుమలలో మరో అపచారం బహిర్గతం

ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్‌పై విచారణ జరిపిస్తున్నారు. అదే విధంగా విద్యుత్ స్కామ్ నిజంగా జరిగి ఉంటే, అది దాచిపెట్టడం కష్టమే. అయితే ఇంతకాలం మౌనం పాటించడం వెనుక కొన్ని కారణాలు ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. లిక్కర్ స్కామ్‌ దర్యాప్తు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ విషయం వాయిదా వేసి ఉండవచ్చు. ఇక మద్యం కేసు మెల్లగా కొలిక్కి వస్తున్న తరుణంలో ఇప్పుడు విద్యుత్ స్కామ్‌ను ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా బయట పెట్టించి ఉండవచ్చని మరో అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా, ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణలు నిజమైతే, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొత్త సమస్య తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ పదవులు ఎప్పుడు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే...

వాళ్ళను వదలొద్దు.. చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర...

ఉప్పు, పప్పు కూడా...

ఇద్దరు అధికారులు తన్నుకుంటే.. అది ఏమవుతుందో...

చంద్రబాబు ధైర్యానికి ఫిదా.....

సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయ నాయకులు...

భారతీయ విద్యార్ధులకు ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకునే...

కొండా వివాదం సద్ధుమణిగినట్లేనా..?

తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం కాంగ్రెస్...

పోల్స్