Friday, September 12, 2025 07:23 PM
Friday, September 12, 2025 07:23 PM
roots

ఏకతాటిపైకి పార్టీ.. లోకేష్ కు రూట్ క్లియర్

తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో కీలక పరిణామాలు దిశగా అడుగులు పడుతున్నాయి. రాజకీయంగా ప్రస్తుతం బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడిని ఎన్నుకునే విషయంలో కీలక నిర్ణయం తీసుకునే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందనే వార్తలు చూస్తూనే ఉన్నాం. దాదాపు 13 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వినపడుతోంది.

Also Read : ఏపి డిప్యూటీ సీఎం మాస్ వార్నింగ్..!

చంద్రబాబు తర్వాత పార్టీని ముందు నడిపించేది లోకేష్ అనే క్లారిటీకి ఇప్పటికే పార్టీ క్యాడర్ కూడా వచ్చేసింది. దీంతో లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మహానాడులో పార్టీ నేతలు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇదే అభిప్రాయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ముందు ఉంచుతున్నారు.

Also Read : కడప జిల్లా స్వీప్ చెయ్యాలి.. చంద్రబాబు సంచలన కామెంట్స్

ఈ విషయంలో ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా మాట్లాడని నాయకులు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. పార్టీ సీనియర్ నేతల నుంచి కూడా ఈ విషయంలో సహకారం ఉండటం లోకేష్ కు కలిసి వచ్చే అంశం. 2019లో అధికారం కోల్పోయిన తర్వాత పలు కార్యక్రమాలు, పాదయాత్రతో లోకేష్ ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లారు. చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో కూడా ఎక్కడా ధైర్యం కోల్పోకుండా.. చక్రం తిప్పారు లోకేష్. ఆ సమయంలో పార్టీ నాయకులు చేజారి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Also Read : ఆళ్ళకు ముహుర్తం ఖరారు అయిందా..?

పాదయాత్రతో ప్రజలకు దగ్గర కావడమే కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటును టిడిపి వైపు మళ్ళించడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఇక లోకేష్ ప్రసంగాల్లో కూడా క్రమంగా మార్పులు వచ్చాయి. ఏ ప్రసంగాలు అయితే లోకేష్ కు ఒకప్పుడు మైనస్ అని భావించారో ఇప్పుడు అవే ప్రసంగాలు లోకేష్ కు ప్లస్ అయ్యాయి. మీడియా సమావేశాల్లో కూడా గతంలో కంటే ఇప్పుడు దూకుడుగా ఉంటున్నారు లోకేష్. ఎవరు ఏ ప్రశ్న అడిగినా సరే దానికి సమాధానం ఇవ్వడంలో ఆయన పక్కాగా ఉంటున్నారు. దానికి తోడు కార్యకర్తలకు కూడా లోకేష్ దగ్గర కావడం మరింతగా కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్