టీం ఇండియా యువ స్టార్ ఆటగాడు రిషబ్ పంత్… ఐపిఎల్ లో తన జట్టు ఢిల్లీని వీడటంపై క్లారిటీ ఇచ్చాడు. డబ్బుల కోసం తాను ఢిల్లీ టీం నుంచి బయటకు రాలేదని క్లారిటీ ఇచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ చేసిన ఓ పోస్ట్ పై పంత్ రియాక్ట్ అయ్యాడు. ఈ పోస్ట్ లో… సునీల్ గవాస్కర్… పంత్ ను ఎందుకు ఢిల్లీ కొనసాగించలేదు అనే అంశంపై వివరించే ప్రయత్నం చేసాడు. ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ… ఢిల్లీ నుంచి పెద్ద మొత్తం అంది ఉండకపోవచ్చు అని అందుకే బయటకు వచ్చాడని అభిప్రాయపడ్డాడు.
Also Read : మరో మాజీకి ఝలక్ ఇచ్చిన జగన్…!
ఇక నవంబర్ 24 మరియు 25 తేదీల్లో జరగనున్న మెగా వేలంలో క్యాపిటల్స్ పంత్‌ను తిరిగి కొనుగోలు చేయాలని చూస్తుందని కూడా అభిప్రాయపడ్డాడు గవాస్కర్. దీని గురించి వెంటనే రియాక్ట్ అయిన పంత్… నేను బయటకి వచ్చింది డబ్బు కోసం కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అంటూ రియాక్ట్ అయ్యాడు. వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అక్షర్ పటేల్‌కు రూ. 16.5 కోట్లు, కుల్దీప్ యాదవ్‌ను రూ. 13.5 కోట్లు, దక్షిణాఫ్రికా స్టార్ ట్రిస్టన్ స్టబ్స్‌కు రూ. 10 కోట్లు చెల్లించారు.
Also Read : తిరుమలలో సంచలనాత్మక మార్పులకు బిఆర్ నాయుడు శ్రీకారం
అలాగే మరో అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్‌ను రూ. 4 కోట్లకు అట్టిపెట్టుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఆటగాళ్లలో ఎవరికీ క 18 కోట్ల రూపాయలను చెల్లించలేదు. ఇక ఇదే సమయంలో తమ కోచ్ గా యువరాజ్ సింగ్ ను నియమించాలని పంత్ కోరగా… కుదరదని జట్టు యాజమాన్యం చెప్పడంతో బయటకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వేలంలో పంత్ పాల్గొనడంతో అతన్ని ఎంతకు రిటైన్ చేస్తారు అనేది చూడాలి. రికి పాంటింగ్, పంత్ కు మధ్య మంచి స్నేహం ఉంది. పాంటింగ్ ఢిల్లీ నుంచి బయటకు రావడంతోనే పంత్ బయటకు వచ్చినట్టు సమాచారం.