పంత్ ఈ సీజన్లో భారీ అంచనాల మధ్య లక్నో జట్టులోకి వచ్చాడు. గత సీజన్లో లక్నో జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించాడు. అయితే హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు అత్యంత పేలవమైన ఆటతీరు ప్రదర్శించడంతో.. మైదానంలోనే లక్నో యజమాని సంజీవ్ గోయంకా రాహుల్ తో వాదనకు దిగాడు. అందరూ చూస్తుండగానే యజమాని నిలదీయడంతో ఈ సీజన్లో లక్నో జట్టు తరుపున ఆడేందుకు రాహుల్ ఆసక్తి చూపించలేదు. దీనికి తోడు లక్నో యాజమాన్యం కూడా ఆయనను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో రాహుల్ లక్నో జట్టు నుంచి బయటకి వచ్చి ఢిల్లీ జట్టులో చేరిపోయాడు. మరోవైపు ఢిల్లీ జట్టుకి నాయకత్వం వహించిన రిషబ్ పంత్ వేలల్లోకి వచ్చాడు. వేలంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ ధరకి అతన్ని లక్నో జట్టు సొంతం చేసుకుంది.
Also Read : దుమ్ము రేపిన మ్యాన్ ఆఫ్ ది మాసేస్
అక్కడితో ఆగక అతడికి సాలార్ సినిమాలో మాదిరిగా ఎలివేషన్లు ఇచ్చింది. ఈసారి ఎలాగైనా కప్ గెలిచేది తామేనంటూ ప్రచారం చేసుకుంది. దానికి తగ్గట్లుగానే రిషబ్ పంత్ కూడా మైదానంలో తీవ్రగా కష్టపడుతూ కనిపించాడు. కానీ ఈ సీజన్లో అంతగా ఆకట్టుకోలేక పోయాడు. ఒకవైపు కెప్టెన్ గా, మరోవైపు ఆటగాడిగా కూడా విఫలం అయ్యాడని క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ లో డక్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత కూడా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మినహా అన్నిటిలోనూ విఫలం అయ్యాడు. రిషబ్ పంత్ కీలకమైన గేమ్స్ లో చేతులెత్తేయడంతో లక్నో జట్టు గ్రూప్ దశ నుంచి ఇంటికి వెళ్లిపోవడం ఖాయం అయింది. ఈ సీజన్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో ౬౩ పరుగులు చేసిన పంత్, మిగిలిన అన్ని మ్యాచ్ లలో విఫలం అయ్యాడు.
Also Read : ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్న ధోనీ.. షాకింగ్ డెసిషన్..?
ఈ సీజన్లో 12 మ్యాచ్ లు ఆడిన రిషబ్ మొత్తం 135 పరుగులు మాత్రమే చేసాడు. ఇందులో అత్యధిక పరుగులు 63.. స్ట్రైక్ రేట్ 100, యావరేజ్ కేవలం 12.27 అంటే అతని బ్యాటింగ్ ఎంత దరిద్రంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు రిషబ్ పంత్ నాయకుడిగా కూడా విఫలం కావడంతో వచ్చే సీజన్లో అతడిని సారధిగా లక్నో కొనసాగించడం అనుమానంగా కనిపిస్తోంది. మరోవైపు జట్టు ఓటమిని తట్టుకోలేక ఇప్పటికే సంజీవ్ గోయంకా కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. అంత బాగా ఆడే కేఎల్ రాహుల్ ను పక్కన పెట్టిన సంజీవ్ గోయంకా.. రిషబ్ పంత్ ని మాత్రం ఎందుకు ఉపేక్షిస్తాడు అని క్రీడా పండితులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే కేఎల్ రాహుల్ మాదిరిగానే రిషబ్ పంత్ కూడా లక్నో జట్టుని వీడాల్సి వచ్చి.. కొత్త జట్టుని వెతుక్కోవాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కూడా పంత్ విఫలం అయ్యాడు. కేవలం 7 పరుగులే చేసి అవుట్ అయ్యాడు.