Wednesday, February 4, 2026 09:45 AM
Wednesday, February 4, 2026 09:45 AM

ప్రభాస్ చీర స్టోరీ చెప్పేసిన హీరోయిన్..!

రిద్దీ కుమార్.. టాలీవుడ్ జనాలకు ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈమె పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో కనబడుతోంది. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తూ ఉండగా అందులో ఈమె కూడా ఒకరు. అయితే ఈ వేడుకలో ఆమె మాట్లాడిన మాటలు, కట్టుకున్న చీర గురించి చెప్పిన విషయం సంచలనం అయింది. తనకి ప్రభాస్ చీర గిఫ్ట్ గా ఇచ్చాడు అని, ఇప్పుడు కట్టుకున్నాను అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అసలు ప్రభాస్ చీర ఎందుకు ఇచ్చాడు అనే దానిపై సోషల్ మీడియా జనాలు ఆరా తీయటం మొదలుపెట్టారు.

Also Read : విజయ్ దేవరకొండ–రష్మిక పెళ్లి ఎప్పుడంటే..!

అయితే దీనిపై రిద్దీ లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మూడేళ్ళ క్రితం రాజా సాబ్ సెట్ లో అడుగుపెట్టినప్పుడే ప్రభాస్ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన పుట్టినరోజు, దీపావళీ రెండు కలిసి వచ్చేసరికి యూనిట్ అందరికీ పెద్ద పార్టీ ఏర్పాటు చేశారని గుర్తు చేసుకుంది. దానికి నాకు ఆహ్వానం అందిందని, కానీ, తను ముంబైలో ఉండడంతో ఆ పార్టీకి వెళ్ళలేదట. ఆ తరువాత ప్రభాస్ కి తాను ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్లి బర్త్ డే విషెస్ చెప్పానని చెప్పుకొచ్చింది. ప్రభాస్ లో తనకు ఎక్కువ కర్ణుడు కనిపిస్తాడని ఆకాశానికి ఎత్తేసింది. ఆయనకు సంబంధించిన ఒక బుక్ ని నేను ప్రభాస్ కి గిఫ్ట్ చేశానని గుర్తు చేసుకుంది ఈ హీరోయిన్.

Also Read : మధ్యలో ఆయనెందుకు వచ్చాడు మీకు..!

ఆ గిఫ్ట్ చూసి ఆయన చాలా సర్ ప్రైజ్ అయ్యి.. ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చావో తెలుసా.. నాకు ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పారని.. ఆ తరువాత కల్కిలో కర్ణుడిగా ప్రభాస్ కనిపించడంతో అప్పుడు నాకు అర్ధమయ్యింది ఆరోజు ఎందుకు ఆయన అంతలా ఆశ్చర్యపోయారో అంటూ చెప్పుకొచ్చింది. తరువాత షూటింగ్ జరుగుతున్న సమయంలో తన క్యార్ వాన్ లో వెళ్లానని .. అక్కడ ఫ్లవర్స్, స్వీట్స్ పాకెట్స్ ఉన్నాయని తెలిపింది. ప్రభాస్ గిఫ్ట్ పంపారు అని చెప్పారనీ.. ఆయన గిఫ్ట్ అంటే చాక్లెట్స్ ఉంటాయని అనుకున్నాననీ.. కానీ, పక్కనే ఎంతో అందమైన సబ్యసాచి చీరను చూసి నేను షాక్ అయ్యానని పేర్కొంది. ఆ చీరను ఈ ఈవెంట్ లో కట్టుకోవడానికి ఇన్నేళ్లు దాన్ని దాచి ఉంచానని వెల్లడించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్