Tuesday, October 28, 2025 04:20 AM
Tuesday, October 28, 2025 04:20 AM
roots

ఫోటోలు అక్కర్లా.. రేవంత్ మార్క్ రియాక్షన్

తెలంగాణలో గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం కాస్త హాట్ టాపిక్ అవుతోంది. ఆయన బిజెపిలో ఉన్న కీలక నేతలతో సఖ్యతగా ఉండటం.. పదేపదే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయడం వంటివి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహంగానే ఉంది అనే ప్రచారం జరుగుతుంది.

Also Read : సింపతీ కార్డుతో కామెడి పీస్ అయిన పోసాని…!

రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనే ప్రచారం గట్టిగా జరిగింది. ఇక తాజాగా.. రేవంత్ రెడ్డి వీటికి సమాధానం ఇచ్చారు. గాంధీ కుటుంబంతో తనకు చాలా మంచి అనుబంధం ఉందని.. ఫోటోలు దిగి నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి. తాను ఎవరో తెలియకుండానే పిసిసి అధ్యక్షుడు.. సీఎం పదవులకు ఎంపిక చేస్తారా అని నిలదీశారు. ఎవరి ట్రాప్ లోను తాను పడలేదని.. విదేశాంగ మంత్రి జయశంకర్ ను కలవడానికి ఢిల్లీ వచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : రాజమౌళి – మహేష్ ప్రాజెక్ట్ పై బాలీవుడ్ మీడియా ఫోకస్

ప్రతిపక్ష నేత కేసిఆర్.. గవర్నర్ ప్రసంగానికి హాజరు కావడం కాదని, సభలో చర్చకు హాజరుకావాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ లిమిటేషన్ ఫర్ సౌత్ అని సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఆ అంశాలు సాధించుకు రావాలనే ఆయనను ప్రశ్నిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. తన విషయంలో ప్రతిపక్ష పార్టీ ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదని, తనకు కాంగ్రెస్ లో సానుకూల వాతావరణము ఉందని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలను అడిగిందుకే తాను ఢిల్లీ వస్తున్నానని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్