Tuesday, September 9, 2025 03:01 PM
Tuesday, September 9, 2025 03:01 PM
roots

రేవంత్ గోప్యతకు కారణం అదేనా..?

రాజకీయాల్లో తెలంగాణ కాంగ్రెస్ కాస్త డిఫరెంట్ ఫాక్టర్. ఆ పార్టీలో ఏం జరుగుతుందో అంచనా వేయడం అధిష్టానానికి కూడా కష్టమే. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతర్గత సమస్యలతో చికాకు పడుతోంది. రాజకీయంగా బలంగా ఉన్నట్లు కనపడుతున్న కాంగ్రెస్.. కొందరు నాయకుల దెబ్బకు ప్రభుత్వంలో కూడా ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు ఒకరిద్దరు కోవర్ట్ మంత్రులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తలనొప్పిగా మారినట్లు మీడియాలో చర్చ మొదలైంది.

Also Read : బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ – కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్!

భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో.. సదరు నాయకులు పరోక్షంగా అత్యంత సన్నిహితంగా మెలిగారు. 2018లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి వారే కారణం అనే ప్రచారం సైతం జరిగింది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు కూడా తీసుకున్న ఆ ఇద్దరు నాయకులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారట. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ వ్యవహారంలో.. ఆ నాయకులు వ్యవహార శైలి అర్ధమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో గోప్యత పాటించారు.

Also Read : లేట్ అయినా పర్వాలేదు.. మంత్రి పదవి ప్లీజ్

కేసును సిబిఐకి అప్పగించే విషయంలో రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదే ప్రధాన కారణం అని సమాచారం. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని కేవలం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటుగా.. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి మాత్రమే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారట. ఈ కేసు విషయంలో కొన్ని చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం దిగకుండా సదరు నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అనే ప్రచారం కూడా ఉంది. కొందరు మంత్రులపై నమ్మకం లేని రేవంత్ రెడ్డి.. ఈ విషయాన్ని పెద్దగా మంత్రులతో మాట్లాడలేదని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి తో మాత్రమే ఈ కేసు గురించి రేవంత్ రెడ్డి ఎక్కువగా చర్చించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఆ ఒకరిద్దరి మంత్రుల విషయంలో ఇప్పట్లో రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉండటంతోనే.. కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మాకు ఈ పదవులు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర...

గ్లాస్ స్కై వాక్...

ఏదైనా మంచి జరిగితే.. అది మా...

సజ్జలపై జగన్ సీరియస్.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి...

రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల...

దేశ రాజకీయాల్లో వారసత్వం అనేది ఎప్పుడూ...

అసలు బీఆర్ఎస్‌లో ఏం...

తెలంగాణ అంటే కేసీఆర్... కేసీఆర్ అంటే...

మేడం గురించే చర్చ..!

రెండు రోజులుగా సోషల్ మీడియా మోత...

పోల్స్