తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నా సరే దీనిపై రాష్ట్ర సర్కార్ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మంత్రి వర్గ విస్తరణ కూడా జరిగిన నేపధ్యంలో దీనిపై త్వరలోనే ప్రకటన ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా ఉండటంతో దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదని కాంగ్రెస్ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాతావరణం కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా ఉండటంతో ఎన్నికలు కష్టమే అని భావించారు అంతా.
Also Read : అమరావతిలో భారీగా పనులు.. సర్కార్ కీలక నిర్ణయం
కాని తాజాగా సిఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా ఇంఛార్జ్ మంత్రులదే అని స్పష్టం చేసారు. నిధులు.. బాధ్యతలు అన్నీ మీదగ్గరే ఉన్నాయన్నారు సిఎం. జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు దృష్టిపెట్టడం లేదని.. ఇది సరైంది కాదన్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదని సిఎం నిలదీశారు. వెంటనే జిల్లాల్లో పదవులు భర్తీ చేయండని మంత్రులను ఆదేశించారు సిఎం.
Also Read : ఇరాన్ కు భయపడ్డ అమెరికా.. అందుకే సీజ్ ఫైర్..?
18 నెలల ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్.. బూత్, గ్రామ, మండలస్థాయిలో కమిటీలు ఉండాలన్నారు. పార్టీ నిర్మాణంపైనా పీసీసీ దృష్టి సారించాలని.. పార్టీ నాయకులు అంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం సిద్ధంగా ఉండాలి అని నేతలకు స్పష్టం చేసారు. గ్రామాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను.. త్వరలోనే ప్రజల్లోకి వెళ్తున్నా అంటూ స్పష్టం చేసారు.