ఈనెల 26న ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయింది. నేటి నుంచి రైతు భరోసా కి వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించే పనిలో పడింది తెలంగాణా వ్యవసాయ శాఖ. గతంలో భూములు లేని వారికి కూడా రైతు భరోసా ఇచ్చారనే ఆరోపణలు వినిపించాయి. దీనితో కాంగ్రెస్ సర్కార్.. మోసాలను అరికట్టే దిశగా అడుగులు వేస్తోంది.
Also Read : బైరాపై దాడి.. దేవర రియాక్షన్ ఇదే
నేటి నుంచి ఈ నెల 20 వరకు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పర్యటించి సాగుకు అనుకూలమైన భూముల గుర్తిస్తారు. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న సాగు భూమి వివరాలు ఆధారంగా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సర్వే జరగనుంది. కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లు నాలా కన్వర్షన్ అయిన భూములను గుర్తించి రికార్డ్స్ నుంచి తొలగించే అవకాశం ఉంది. సంబంధిత భూముల వివరాలను ఇప్పటికే రెవిన్యూ డిపార్ట్మెంట్ నుంచి వ్యవసాయ శాఖకు బదిలాయించారు. 21 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు ఏర్పాటు చేసి ఫైనల్ లిస్ట్ కు గ్రామ సభలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Also Read : జగన్ ముందు ఎక్కిళ్ళు.. బాబు ముందు కక్కుళ్ళు…!
గ్రామ సభల్లో ఆమోదించిన లిస్ట్ గ్రామాల్లో ఫ్లెక్సీలు, నోటీస్ బోర్డు లో ప్రదర్శిస్తారు. 25న తుది జాబితాను జిల్లా కలెక్టర్లు కన్ఫామ్ చేసి ఇన్చార్జి మంత్రులచే ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. ఇంచార్జ్ మంత్రులు ఆమోదించిన జాబితా ఆధారంగా ఈనెల 26 నుంచి రైతు భరోసా అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే ప్రజా పాలనలో వచ్చిన 80 లక్షల అప్లికేషన్లను అప్ లో అప్లోడ్ చేసింది రెవెన్యూ శాఖ. లిస్టు ఆధారంగా ఈ నెల 20 నుంచి గ్రామసభల్లో చర్చించి ఫైనల్ లిస్ట్ గ్రామాల్లో బ్యానర్లు, నోటీస్ బోర్డు ప్రదర్శన ఉంటుంది. రేషన్ కార్డుల మంజూరుకు కూడా ప్రజాపాలనల అప్లికేషన్ల ఆధారంగా సర్వే చేయనున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వాళ్లకు ఆధార్ కార్డు లింక్ చేయనున్నారు. ఆధార్ లింక్ ఆధారంగా భూమిలేని నిరుపేదలను గుర్తించి ఆర్థిక సహాయం చేయనుంది ప్రభుత్వం.