Tuesday, October 28, 2025 08:12 AM
Tuesday, October 28, 2025 08:12 AM
roots

విజయ్ పాల్ కు ముహూర్తం ఫిక్స్…?

గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన కొందరు అధికారులకు ఇప్పుడు ప్రభుత్వం ఎర్త్ పెట్టడానికి రెడీ అయింది. ఓ వైపు వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదులు, మరోవైపు కొందరు అధికారులపై పోలీసులు సీరియస్ గా ఫోకస్ చేసారు. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న ప్రస్తుత డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజును పోలీస్ కస్టడీలో హింసించిన అధికారుల విషయంలో అధికారులు విచారణ ముమ్మరం చేసారు. తాజాగా ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి రిటైర్డ్ సిఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ హాజరు అయ్యారు.

Also Read : ఫోన్ ట్యాపింగ్ లో షేక్ అవుతున్న బీఆర్ఎస్

విజయపాల్ ని ఉండి ఎమ్మెల్యే రఘురామ రాజు కేసులో A1 చేర్చిన గుంటూరు నగరంపాలెం పోలీసులు.. అప్పటి సిఐడి అదనపు ఎస్పీగా ఉన్న విజయపాల్… ఆయనకు వ్యతిరేకంగా పలు సాక్ష్యాలను సేకరించారు. 2021 మే 14న రఘురామను సిఐడీ అధికారులు ఆయన ఇంటి వద్దకు వెళ్లి అరెస్ట్ చేసారు. పోలీస్ కష్టడిలో తనను హింసించారు అని… రఘురామ ఫిర్యాదు చేసారు. ఏపీ లో నూతన ప్రభుత్వం వచ్చాక తనపై హత్యాయత్నం జరిగిందని రఘురామ గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్ పై ఈ నేపధ్యంలో కేసు నమోదు అయింది. విజయపాల్ అరెస్ట్ కాకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరారు విజయపాల్. హైకోర్టు ముందస్తు బెయిల్ కు నిరాకరించడంతో… సుప్రీంకోర్టును విజయపాల్ ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురు అయింది. విజయపాల్ ను పోలీసుల విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించగా… ఆయన నేడు విచారణకు హాజరు అయ్యారు.

Also Read : పిల్ల సజ్జల గ్యాంగ్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు

రఘురామకృష్ణరాజు కేసులో ప్రత్యేక విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ని ప్రభుత్వం నియమించింది. సీఐడీ కార్యాలయంలో రబ్బర్ బెల్టుతో, లాఠీతో కొట్టారని, తీవ్రంగా హింసించారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ లపై రఘురామ ఫిర్యాదు చేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్