Saturday, September 13, 2025 05:20 AM
Saturday, September 13, 2025 05:20 AM
roots

“కల్తీ లడ్డు” కథ నడిపింది ప్రకాశం జిల్లా నేతే..?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో నలుగురిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) నాడు డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ(పూనంబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఎఆర్ డైరీ(దుండిగల్) ఎండి రాజు రాజశేఖరన్ లను అరెస్టు చేసింది దర్యాప్తు బృందం. క్రై నెంబర్ 470/24లో అరెస్టు చేసి తిరుపతి లోని మెజిస్ట్రేట్ నివాసములో హాజరు పరిచారు.

Also Read: టీడీపీలో డేంజర్ సైరన్.. లోకేష్ అలర్ట్ అవ్వాల్సిందే

దర్యాప్తులో అక్రమాలు బట్టబయలు అయినట్టు తెలుస్తోంది. నెయ్యి సరఫరా పేరులో అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తించారు. ఎఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నారు వైష్ణవి డైరీ ప్రతినిధులు.ఎఆర్ డైరీ పేరు ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి టెండర్ కథ నడిపింది వైష్ణవి డైరీ. రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు కూడా సిద్దం చేయడం గమనార్హం. భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థం లేదని విచారణలో అధికారులు గుర్తించారు.

Also Read: రాము.. ఏమిటిదీ.. ఎందుకిలా..?

సమగ్ర విచారణతో అక్రమాలను గుర్తించిన దర్యాప్తు బృందం గుర్తించింది. గత ప్రభుత్వ హాయంలో తిరుమల లడ్డూ లో అపవిత్ర పదార్థాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. లడ్డూ కల్తీ వ్యవహారం బయటపడడంతో దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. వివాదంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ బృందంలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరిని తీసుకున్నారు.

Also Read: జగన్ 2.0 అంటే ఏమిటో తెలుసా..?

దర్యాప్తు బృందంలో ఏపీ ప్రభుత్వం తరఫున గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, సీబీఐ తరఫున హైదరాబాద్‌ జోన్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వీరేశ్‌ ప్రభు, విశాఖ ఎస్పీ మురళి తో పాటు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సలహాదారు డాక్టర్‌ సత్యేన్‌కుమార్‌ పాండా ఉన్నారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూల తయారీకి టీటీడీ రోజుకు 15 వేల కిలోల ఆవు నెయ్యి వినియోగిస్తారు. తమిళనాడుకు చెందిన AR ఫుడ్స్ కిలో నెయ్యి రూ.320 చొప్పున సరఫరా చేసేలా టెండర్లు ఖరారు చేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Also Read: విలువలు, విశ్వసనీయత.. ట్వీట్‌ వార్‌..!

జూలై 8న 8 ట్యాంకర్లు రాగా అందులో 4 ట్యాంకర్ల నెయ్యిని పరీక్షల కోసం ల్యాబ్ కు పంపిన అధికారులు.. అపవిత్ర పదార్థులు నెయ్యిలో కలిసినట్లు జులై 17వ తేదీన NDDB ల్యాబ్ నివేదిక ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వెలుగు కల్తీ భాగోతం వెలుగులోకి వచ్చింది. వైష్ణవి డైరీ వెనుక.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కీలక వైసీపీ నేత ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. అతనిని కూడా అధికారులు త్వరలో విచారించే అవకాశం ఉందని పోలీసులు వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్