వైసిపి అధికారంలో ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కువగా సంపాదించిన వ్యక్తుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. జగన్ కంటే ఎక్కువగా ఆయనకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉండేది. కేవలం జగన్ ముఖ్యమంత్రి రూపంలో ఒక బొమ్మ మాత్రమే అనేది అప్పట్లో ప్రధానంగా వినపడే ఆరోపణ. సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకునే పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అని కూడా ఆక్రమించారని టిడిపి ఆరోపణలు చేస్తూ వచ్చింది.
Also Read : పవన్ రాకతో విభేదాలు తొలగినట్లేనా..?
ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం విషయంలో కఠినంగా వ్యవహరిస్తారని అందరూ భావిస్తూ వచ్చారు.. ఇక అప్పట్లో వార్నింగ్ ఇచ్చిన మాదిరిగానే కూటమి ప్రభుత్వం సజ్జల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తుంది. తాజాగా తన సొంత జిల్లా కడపలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కొన్ని అక్రమాలపై పోలీసులు అలాగే అటవీ శాఖ అధికారులు ఫోకస్ పెట్టారు. కడప జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగు రిజర్వ్ ఫారెస్ట్ లో అడవిని అడ్డంగా నరికి దున్నేశారు సజ్జల ఫ్యామిలీ.
Also Read : సింధూ నది ఒప్పందం రద్దైతే పాక్ లో ఏం జరుగబోతోంది..?
63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని అటవీ శాఖ అధికారులతో పాటుగా రెవిన్యూ శాఖ అధికారులు నివేదికలు ఇచ్చారు. 55 ఎకరాలు ఆక్రమణకు గురైందని అటవీ శాఖ పేర్కొంది. మొత్తం 63 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసినట్లుగా తేల్చారు. దీంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగి రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. అదేవిధంగా కొన్నిచోట్ల ఫామ్ హౌస్ నిర్మాణాలు కూడా చేపట్టినట్లు సమాచారం. రామకృష్ణారెడ్డి తో పాటుగా చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇదే స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారు. వైసీపీలో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించేవారు. ఇద్దరు అటవీ భూములను పెద్ద ఎత్తున ఆక్రమించడం సంచలనం అవుతుంది. మరి దీనిపై ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి.




