బద్రీ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు రేణు దేశాయ్. ఆ తర్వాత జానీ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కొద్ది రోజులకే పవన్ కల్యాణ్‌ను వివాహం చేసుకున్న రేణు దేశాయ్ మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. చాలా ఏళ్ల తర్వాత రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర్రావు సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు రేణు. సిల్వర్ స్క్రీన్‌కు దూరంగానే ఉన్న రేణు.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉన్నారు. ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్స్ రేణు ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి. ఇక పిల్లలు పెద్దవాళ్లు అయిన తర్వాత రేణు వారి కెరీర్‌పై దృష్టి పెట్టారు.
Also Read : ఏపీ ఎఫెక్ట్.. రంగంలోకి ట్రబుల్ షూటర్..!
పవన్ సతీమణిగా రేణుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే రేణు దేశాయ్‌కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో రేణు విస్తృతంగా పాల్గొంటారు. సామాజిక సమస్యలపై ప్రజల్లో కల్పిస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో రేణు ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆసుపత్రిలో ఉన్నా అంటూ రేణు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Also Read : బ్రేకింగ్: ఛీఫ్ సెలెక్టర్ గా రవిశాస్త్రి
ఆసుపత్రిలో ఉన్న రేణు దేశాయ్ రేబిస్ టీకా తీసుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. సాధారణంగా టీకాలు తీసుకుంటున్న ఫోటోలు ఇప్పటి వరకు తీసుకోలేదన్నారు. అది తనకు అలవాటు లేదన్నారు. కానీ ప్రజల్లో అవగాహన కల్పించాలనే భావనతోనే వీడియో పోస్ట్ చేస్తున్నట్లు రేణు తెలిపారు. జంతువులను, పశువులను పెంచుకునే వాళ్లు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలన్నారు. వాటిని తప్పని సరిగా రికార్డు చేసుకోవాలని సూచించారు. సరైన సమయానికి వాక్సిన్ తీసుకుంటున్నారో లేదో కూడా తెలుసుకోవాలని రేణు సూచించారు. ప్రస్తుతం రేణు దేశాయ్ టీకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.