ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో దాదాపు సభ్యులు అందరూ తమ తమ నియోజకవర్గాల సమస్యలను పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నారు. ఈ టైంలో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి సంచలనం అవుతున్నారు. నియోజకవర్గ సమస్యల గురించి… అసెంబ్లీ సమావేశాలను ఆమె వినియోగిస్తున్న తీరు చూసి సీనియర్ ఎమ్మెల్యేలు కూడా షాక్ అవుతున్నారు. మహిళా ఎమ్మెల్యేలకు ఆమె దిక్సూచిలా మారిపోయారు శాసన సభలో.
Also Read : వల్లభనేని వంశీకి షాక్ ఇచ్చిన టిడిపి సర్కార్
ప్రతీ రోజు సభలో ఆమె ఏదోక సమయంలో ప్రసంగిస్తునే ఉన్నారు. కడపలో తాగు నీటి సమస్య విషయంలో ఆమె చేసిన ప్రసంగం ప్రభుత్వ పెద్దలను కూడా ఆకట్టుకుంది. ఒక్కొక్కరికి ఎన్ని లీటర్ల నీళ్ళు అవసరం, గతంలో ఇక్కడి ఎమ్మెల్యేలు ఏం చేసారు అనే విషయాలను ఆమె మాట్లాడారు. కడప నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు పని చేసినా ఓ ఉప ముఖ్యమంత్రి పని చేసినా కడపకు ఏ విధంగా అన్యాయం జరిగింది అనే విషయాలను ఆమె సభలో వివరించారు. అలాగే కడప బస్టాండ్ గురించి కూడా ఆమె చాలా హుందాగా ప్రసంగించారు.
Also Read : మరో మాజీకి ఝలక్ ఇచ్చిన జగన్…!
గత పాలకులు కడప నియోజకవర్గాన్ని ఏ విధంగా నాశనం చేసారో ఆమె లెక్కలతో సహా వివరిస్తున్నారు. మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్నారు. వైసీపీపై అనవసర విమర్శలు చేయకుండా ప్రతీ ఒక్కటి లెక్కలతో మాట్లాడుతున్నారు మాధవి. ఆమె ప్రసంగానికి సోషల్ మీడియాలో కూడా జనాలు ఫిదా అవుతున్నారు. అనవసర పొగడ్తలు లేకుండా మహిళా ఎమ్మెల్యే అయినా కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యంగా సభలో ఆమె ప్రసంగించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.