Tuesday, October 28, 2025 01:36 AM
Tuesday, October 28, 2025 01:36 AM
roots

కసిరెడ్డిని కాపాడుతున్నందుకేనా..? పీఎస్ఆర్ అరెస్ట్ వెనుక సంచలనం

ఆంధ్రప్రదేశ్ పోలీసులు వరస సంచలనాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం గతంలో రెచ్చిపోయిన వాళ్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అరెస్ట్ అయ్యే చాన్స్ లేదు అనుకున్న ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తూ షాక్ ఇస్తున్నారు పోలీసులు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నమోదైన ప్రతి కేసుకు పరిష్కారం చూపించే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. గత ఏడాది నమోదైన కేసుల్లో హీరోయిన్ కేసు ఒక సంచలనం. వ్యాపారవేత్త కోసం సినిమా హీరోయిన్ ను గత ఏడాది అరెస్టు చేసి పోలీసులు చుక్కలు చూపించారు.

Also Read : టార్గెట్ రోజా… పెద్దాయన మాస్ ర్యాగింగ్..!

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హీరోయిన్ జత్వాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు ఐపీఎస్ అధికారులను అప్పట్లో సస్పెండ్ చేశారు. అలాగే కింది స్థాయి పోలీస్ అధికారులు పై కూడా పలు చర్యలు తీసుకున్నారు. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రానా టాటా, విశాల్ గున్ని లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే కేసులో కాంతి రానా, విశాల్ ఇద్దరు హైకోర్టులో బెయిల్ పొందారు. అయితే ఇప్పటి వరకు పిఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు.

Also Read : తమ్ముడిపై రివేంజ్ ప్లాన్‌లో కేసినేని నానీ.. చంద్రబాబుకు సంచలన లేఖ

దీనిపై రాష్ట్ర హైకోర్టు కూడా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉన్న పోలీసులు తాజాగా హైదరాబాదులో పీఎస్ఆర్ ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించినా సరే సైలెంట్ గానే ఉంది. ప్రభుత్వాన్ని లెక్కచేయకుండా అమరావతి వదిలి హైదరాబాదులో ఉంటున్న ఆంజనేయులు ను ఒక్క సమాచారంతో ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యవహారం సంచలనం అవుతున్న తరుణంలో ఈ అరెస్టు షేక్ చేస్తుంది.

Also Read : జూన్‌ 12న ఏపీలో సంచలన అడుగు

అయితే.. కసిరెడ్డిని కాపాడే విషయంలో పీఎస్ఆర్ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నాయి. హీరోయిన్ కేసు కంటే లిక్కర్ స్కాంను సీరియస్ గా తీసుకున్న సర్కార్.. రాజ్ కేసిరెడ్డిని కాపాడటంలో పీఎస్ఆర్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మధ్యం కేసులో నిందితులను కాపాడేందుకు ఐపీఎస్ మరిన్ని ప్రయత్నాలు చేయడంతోనే పూర్తి సాక్ష్యాధారాలు లభ్యం కావడంతో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్