Monday, October 27, 2025 04:35 PM
Monday, October 27, 2025 04:35 PM
roots

అవినీతికి భారీ మూల్యం.. అసలు తప్పు ఎవరిదీ..?

19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అంతా చూస్తుండగానే కాలి బూడిదయ్యారు. చివరికి గుర్తు పట్టలేని విధంగా శరీరాలు మాడిపోయాయి. మృతదేహాల గుర్తింపు, అప్పగింత ఇప్పటికీ పూర్తి కాలేదు. అయితే ఇక్కడే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు తప్పు ఎవరిదీ..? తప్పు చేసింది ఎవరూ..? శిక్ష ఎవరికి పడింది..? అనే ప్రశ్నలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన వి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న బైకర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని భావించారు. కానీ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో నేషనల్ హైవే మీద బైక్ డ్రైవ్ చేసి డివైడర్‌ను ఢీ కొట్టిన తర్వాత బైక్ నడిరోడ్డుపై పడిపోయింది. చిమ్మ చీకటి, మరోవైపు వర్షం పడుతున్న సమయంలో వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న బస్సు.. ఒక్కసారిగా బైక్ పై నుంచి వెళ్లిపోయింది. దీంతో పెట్రోల్ ట్యాంక్ పేలి బస్సు తగలబడి పోయింది. 19 మంది సజీవ దహనం అయ్యారు.

Also Read : తండ్రీ, కొడుకుల పర్యటనలు సూపర్ హిట్..? తెలుగు వారిలో జోష్..!

ముందు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అన్నారు.. తర్వాత బస్సు ఓనర్ రూల్స్ అతిక్రమించారన్నారు. సీటర్ బస్సును స్లీపర్‌గా ఆల్ట్రేషన్‌ చేశారన్నారు. ఎక్కడో డయ్యూలో రిజిస్ట్రేషన్ చేయించి.. తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతున్నారన్నారు. ఆ బస్సు మీద 20కి పైగా చలానాలు ఉన్నాయన్నారు. ఆ తర్వాత సెల్‌ఫోన్ డబ్బాలు అక్రమంగా రవాణా చేస్తున్నారు.. అవి పేలటం వల్లే ప్రమాద తీవ్రంగా ఎక్కువగా ఉందన్నారు. బస్సులో సెఫ్టీ ప్రికాషన్స్ సరిగ్గా లేవని, ఫైర్ రెసిస్ట్ జాగ్రత్తలు లేవన్నారు. డ్రైవర్ దొంగ సర్టిఫికేట్ అన్నారు. కానీ పెట్రోల్ బంక్‌లో యువకుడి ర్యాష్ డ్రైవింగ్ బయటకు రావటంతో కథ అంతా మారిపోయింది. మద్యం మత్తులో యువకుడి బైక్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని.. ఆ తర్వాతే బస్సు ప్రమాదం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు.. బస్సు డ్రైవర్‌ను ఏ1గా, బస్సు యజమానిని ఏ2గా రిజిస్టర్ చేశారు.

ఇక ప్రమాదం తర్వాత ప్రభుత్వం, అధికారులు, పోలీసులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ప్రమాదం జరిగిన తర్వాత యధావిధిగా బస్సుల తనిఖీ చేపట్టారు. 3 రోజులుగా నిబంధనలు ఉల్లంఘించిన బస్సులు అంటూ హడావుడి చేస్తున్నారు. కేసులు రాస్తున్నారు. బస్సులు సీజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడే అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిజానికి బస్సులు నిబంధనలు ఉల్లంఘించడం ఇదే మొదటి సారి కాదు. ఈరోజు కొత్తగా బస్సులు రోడ్ల మీదకు రాలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య తిరుగుతున్న సగానికి పైగా బస్సులు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయినవే. ఇవి రోజు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు నగరాల మీదుగా రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. అయినా సరే.. ఒక్కసారి కూడా అధికారులకు కనిపించలేదు.. కాదు కాదు.. అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. ఏదైనా బస్సు ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇలా హడావుడి చేస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు మీద 20కి పైగా కేసులున్నా కూడా ఒక్కసారి కూడా ఆ బస్సును ఆపలేదు. ఇక వి కావేరీ ట్రావెల్స్ యజమాని సగానికి పైగా బస్సులను ఆల్ట్రేషన్ చేసి తిప్పుతున్నారని అధికారులు కొత్తగా కనిపెట్టారు. మరి ఇదే విషయాన్ని ఇన్ని రోజులు ఎందుకు గుర్తించలేదు. ఆ బస్సులను ఎందుకు ఇప్పటి వరకు తనిఖీ చేయలేదు.

Also Read : బుకింగ్ క్యాన్సిల్.. ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్ సడెన్ షాక్

కనీసం ఒక్కసారి అయినా నిజాయతీగా తనిఖీ చేసి ఉంటే.. బస్సు యజమాని చేసిన తప్పు బయటపడేది. ఒక్కసారి అయినా నిజాయతీగా సోదాలు నిర్వహించి ఉంటే.. నిజానిజాలు బయటకు వచ్చేవి. ఒక్కసారి అయినా నిజాయతీగా చెక్ చేసి ఉంటే.. ఫైర్ సేఫ్టీ వంటి జాగ్రత్తలు తీసుకున్నారో లేదో తెలుస్తుంది. చెరువులో బర్రెను పెట్టి.. బేరం ఆడినట్లుగా అధికారులు బస్సును బయట నుంచే చూసి.. బస్సు కాగితాల మధ్యలో గాంధీ ఉన్నారో లేదో ఒకటికి పది సార్లు చూసుకుని.. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇస్తే.. ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి, కాలి బూడిదవ్వడానికి అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణమనే మాట బాగా వినిపిస్తోంది. ప్రమాదానికి బైకర్ నిర్లక్ష్యం, బస్సు డ్రైవర్ అజాగ్రత్త, యజమాని తీరు కాదని.. కేవలం ప్రభుత్వ అధికారుల అవినీతి మాత్రమే కారణమంటున్నారు నెటిజన్లు. ఇప్పుడు తనిఖీల పేరుతో చేస్తున్న హడావుడి కూడా మరో రెండు రోజుల్లో ముగిసిపోతుందని సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

ఆర్టీసీ బస్సు తప్పింది.....

కర్నూలు రోడ్డు ప్రమాదం ఘటన విషయంలో...

బుకింగ్ క్యాన్సిల్.. ప్రయాణికులకు...

సాధారణంగా ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం...

పోల్స్