Thursday, October 23, 2025 03:44 AM
Thursday, October 23, 2025 03:44 AM
roots

విజయం పై జగన్ ధీమా ప్రకటన వెనుక కారణం ఏంటి?

ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ప్రజాభిప్రాయం ఓటింగ్ మెషిన్లలో నిక్షిప్తం అయ్యి ఉంది. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఎవరికీ వారే తాము విజయం సాధిస్తున్నామనే ధీమాని వ్యక్తం చేయడం గమనార్హం. అయితే ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారం చేపడతారు అన్న విషయాల పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బెట్టింగ్ నడుస్తుంది. కూటమి వైపు బెట్టింగ్ కాస్తున్న వైసీపీ నాయకుల సంఖ్య పెరుగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఐ-ప్యాక్ టీమ్ తో మీటింగ్ సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ అభిమానుల్లో కొండంత ఆశను పెంచాయి. అయితే జగన్ ధీమా వెనుక కారణం ఏంటి అన్న ఆందోనళ టిడిపి అభిమానుల్లో ఉంది. గత ఎన్నికల సమయంలో కూడా జగన్ ఐప్యాక్ సిబ్బంది కలిసి ఇలానే వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు జగన్ ధీమాతో ఉన్నారా? ఆయన లెక్క ఆయనకు ఉందా? అందుకే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారా? లేకుంటే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే ఆ ప్రయత్నమా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధిస్తానని జగన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా వైసీపీ విజయం.. సంచలనంగా మారుతుంది అని కూడా తేల్చి చెప్పారు. తాజాగా ఆయన ఐ ప్యాక్ టీం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది.

గత ఎన్నికల ముందు నుంచి ఐపాక్ టీం వైసీపీ కోసం పనిచేస్తోంది. ఈ టీం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఏర్పడింది. గత ఎన్నికల్లో వైసీపీకి విజయం సాధించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త పదవిని వదులుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సొంత రాష్ట్రం బీహార్లో రాజకీయాలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో పోలింగ్ నాడే.. సీఎం జగన్ ప్రశాంత్ కిషోర్ ను కలిసారు. సూపర్ విక్టరీ కొట్టామని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే ఈసారి మాత్రం వైసీపీలో ఆ ధీమా కనిపించలేదు. గతం మాదిరిగా ఐపాక్ టీం అధినేత రుషిరాజ్ సింగ్ ను జగన్ కలవలేదు. దీంతో ఒక రకమైన చర్చ ప్రారంభమైంది. అందుకే ఈరోజు జగన్ విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉన్న ఐ ప్యాక్ కార్యాలయాన్ని ప్రత్యేకంగా సందర్శించినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో జగన్ హాట్ కామెంట్స్ చేశారు. రేపు ఫలితాలను చూసి దేశం షాక్ కు గురవుతుందని చెప్పుకొచ్చారు. ఆసక్తికర ఫలితాలు వస్తాయని కూడా తేల్చి చెప్పారు. దీంతో ఇదో వైరల్ అంశంగా మారింది. పోలింగ్ శాతం పెరగడం, ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత, వంటి కారణాలతో వైసిపి శ్రేణులు డీలా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే జగన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అందుకే నేరుగా ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి ఈ కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. కేవలం వైసీపీ ఓటమి చెందుతుందని వస్తున్న విశ్లేషణలు, ప్రచారానికి చెప్పేందుకే జగన్ కీలక ప్రకటన చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే జగన్ ప్రకటనతోవైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

బ్రేకింగ్: డీఎస్పీకి అండగా...

తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు...

ఎమ్మెల్యే బావమరిదిని కంట్రోల్...

రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాల విషయంలో...

జోగి రమేష్ సంగతేంటి..?...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసు వెనకడుగు...

డీఎంకే నేతలతో కలిసి...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మధ్య వ్యవహారానికి, తమిళనాడు...

పర్యటన తెచ్చిన తంటాలు..!

ఒక పర్యటన ఇప్పుడు సిక్కోలు జిల్లా...

పోల్స్