Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

వాళ్లిద్దరి భేటీ… మర్మమేంటి…?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు… శాశ్వత మిత్రులు ఉండరు… ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలైన తర్వాత ఈ మాట నిజం కాదేమో అన్నట్లుగా మారిపోయింది. ఎందుకంటే విపక్ష నేతలపై విమర్శలు చేయడం అనేది సర్వ సాధారణం. కానీ వైసీపీ నేతలు మాత్రం వ్యక్తిగత దూషణలు, బూతులు, వ్యక్తిత్వ హననం, రాజకీయ విమర్శల్లో కుటుంబ సభ్యులను ప్రస్తావించడం.. ఇలా చేయకూడని చెత్త పనులన్నీ చేశారు. దీంతో వైసీపీ నేతలను కలిసేందుకు కూడా ఇతర పార్టీల నేతలు ఇష్టపడటం లేదు. అయితే ఒకరిద్దరు సీనియర్ నేతలు మాత్రం ఇప్పటికీ కాస్త పద్ధతిగానే వ్యవహరిస్తున్నారు.

Also Read : కంగారులను కంగారు పెట్టేసారు… చుక్కలు చూపించిన పేస్ త్రయం

అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఆసక్తికర సంఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పీఏసీ ఛైర్మన్ ఎన్నిక విషయంలో ఎలాంటి బలం లేకున్నా కూడా వైసీపీ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే అధికార పార్టీ తరఫున కూడా నామినేషన్ దాఖలవ్వడంతో.. ఓడితే పరువు పోతుందని భావించిన వైసీపీ నేతలు ముందుగానే బహిష్కరణ అనేసి వెళ్లిపోయారు. అయితే ఎన్నిక జరుగుతున్న సమయంలో లాబీల్లో ఓ ఆసక్తికరమైన అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లిపోతున్న సమయంలో అక్కడే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

అయితే వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం పవన్ ను చూడగానే అక్కడి నుంచి వెళ్లిపోగా… మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాత్రం పవన్‌ను మర్యాద పూర్వకంగా పలకరించారు. అదే సమయంలో పక్కనే యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కూడా ఉన్నారు. వాస్తవానికి ఇద్దరు మధ్య జరిగిన సంభాషణ కేవలం నిమిషం లోపే… అయినా సరే.. ఆ సమయంలో పవన్‌ భుజం తట్టారు బొత్స. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నవ్వుకుంటూ పలకరించుకున్న ఇద్దరు నేతలు… ఏం మాట్లాడుకున్నారనేదే అసలు విషయం. పైగా సభలో పవన్ చాలా హుందాగా వ్యవహరించారంటూ బొత్స మెచ్చుకున్నారనే మాట వినిపిస్తోంది.

Also Read : వీరు పార్టీ మారడం వెనుక ఇంత స్వార్ధం ఉందా?

అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలోనే బొత్స ఎమ్మెల్సీగా గెలిచారు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు ప్రధాన కారణం ఆ ఎన్నికల్లో కూటమికి బలం లేకపోవడమే. అయితే తన గెలుపునకు సహకరించాలంటూ బొత్స స్వయంగా ఫోన్ చేసినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేశాయి. అందుకే చివరి నిమిషంలో ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారనే మాట వినిపిస్తోంది. అందుకే అసెంబ్లీ లాబీల్లో పవన్‌కు బొత్స స్వయంగా ధన్యవాదాలు చెప్పారనే మాట కూడా వినిపిస్తోంది. అసలు ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్