ఒక కిలో బియ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాల 43 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. కానీ రేషన్ కార్డులున్న వారికి మాత్రం కిలో రూపాయికే బియ్యం అందిస్తున్నాయి. అంత్యోదయ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా 2.14 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేయడానికి ఏకంగా 920 కోట్లకు పైగా వెచ్చిస్తున్నాయి. అయితే అందులో కేవలం 20 శాతం మాత్రమే పేదల నోటికి అందుతోంది. 736 కోట్ల విలువైన 1.71 లక్షల టన్నుల బియ్యం పక్కదారి పడుతోంది. ప్రభుత్వాలు ఏడాదికి ఏకంగా 11 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే.. అందులో ఏకంగా 8 వేల 833 కోట్ల విలువైన బియ్యం బ్లాక్ మార్కెట్‌కు పోతోంది.
Also Read : సైబర్ నేరాలు ఏ రేంజ్ లో జరిగాయో తెలుసా..? లెక్క చూస్తే మైండ్ బ్లాక్
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తరచూ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. వందల టన్నుల బియ్యం స్టాక్‌లను గుర్తిస్తున్నారు. ఇక కాకినాడ యాంకరేజ్ పోర్టులో విదేశాలకు తరలిపోతున్న బియ్యంను స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనిఖీలు చేశారు. సీజ్ ద షిప్ అంటూ అప్పట్లో పవన్ చెప్పిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి కూడా. అయితే ఎన్ని తనిఖీలు చేసినా.. ఎంతగా నిఘా పెట్టినా.. అక్రమార్కులపై ఎన్ని కేసులు పెట్టినా కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగటం లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు జరిగే మేలు కంటే కూడా.. పెద్దల జేబులు నిండుతున్నాయనే మాట సరిగ్గా సరిపోతుంది.
రేషన్ మాఫియాలో ఎక్కువగా ప్రజా ప్రతినిదుల పేర్లే వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి నియోజకవర్గంలో కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణ వెనుక ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే లేదా ఆయన బంధువులు, లేదా సన్నిహితుల పేర్లే బాగా వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే రేషన్ వ్యాపారంలో మునిగిపోయారు. ఇంకా చెప్పాలంటే.. నమ్ముకున్న కార్యకర్తను పూర్తిగా పక్కన పెట్టిన అధికార పార్టీ నేతలు.. ప్రతి రోజు టార్గెట్ పెట్టి మరీ వసూళ్లూ చేస్తున్నారు. ఐదేళ్ల పాటు వైసీపీ నేతల పెత్తనం కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడిన టీడీపీ నేతలు, కార్యకర్తలపైన ఎమ్మెల్యేలు ఏ మాత్రం కరుణ చూపించటం లేదు.
Also Read : మొత్తానికి నిజం ఒప్పుకున్న సాక్షి..!
కొంత మంది ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో అయితే కొత్తగా టార్గెట్లు పెడుతున్నట్లు తెలుస్తోంది. పదవులు రాని వాళ్లు కొందరైతే.. ఇక ఇదే ఆఖరి అవకాశం అని డిసైడ్ అయిన వాళ్లు.. మళ్లీ అవకాశం వస్తుందో రాదో అనే భావనతో ఉన్న వాళ్లు.. వచ్చిందే అవకాశం.. అన్నట్లు అక్రమార్జనకు తలుపులు తీశారనేది ప్రధాన ఆరోపణ. కొందరు ఎమ్మెల్యేలు అయితే తమ తమ నియోజకవర్గంలో ఏమైనా చేసుకోవచ్చు.. కానీ తనకు మాత్రం కప్పం కడితే సరిపోతుందని ఓపెన్‌గా క్లారిటీగా చెబుతున్నారట. ఇసుక, రేషన్ బియ్యం, మైనింగ్, పేకాట, చివరికి కోడి పందేలైనా సరే.. నా వాటా నాకు పంపించి మీ పని మీరు చేసుకోవచ్చు అని క్లియర్‌గా చెబుతున్నారని పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. ఇందుకు ఇటీవల పత్రికలో వచ్చిన వార్తలపై చర్చించుకుంటున్నారు కూడా.
పోలవరం ఎమ్మెల్యే వంద కోట్లు అవినీతి చేశాడా.. అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మరో నేతతో జరిపిన ఫోన్ సంభాషణ బాగా వైరల్ అయ్యింది. ఇలాగే రెండు రోజుల క్రితమే.. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే.. అంటూ పేరు లేకుండానే ఓ ప్రముఖ కథనం ప్రచురించింది. ఇక మంత్రుల గురించి టీడీపీ అనుకూల మీడియా వరుస కథనాలు ప్రచురించింది. సూర్యా భాయ్ అని, హైదరాబాద్‌లో ఏపీ మంత్రి సెటిల్‌మెంట్లు అంటూ పెద్ద పెద్ద వార్తలు వచ్చాయి. ఇక హోమ్ మంత్రి అనిత కూడా స్వయంగా తన పీఏ అవినీతి చేస్తున్నట్లు తెలిసింది అంటూ వ్యాఖ్యానించారు. అందుకే తొలగించానంటూ వెల్లడించారు.
Also Read : ప్రాణం పెట్టిన మియాన్ భాయ్.. నిప్పులు చెరిగే బంతులు..!
వాస్తవానికి ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ప్రతి నియోజకవర్గంలో కూటమి నేతల అవినీతి తారాస్థాయిలో ఉందనేది సర్వే సంస్థలు కూడా చెబుతున్న మాట. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో కూటమికి 11 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు ఏపీ ప్రజలు. వైన్ షాపుల టెండర్ల సమయంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చివరికి స్వయంగా చంద్రబాబు కూడా మద్యం వ్యాపారంలో మీకేం పని అంటూ పార్టీ ఎమ్మెల్యేలను బహిరంగంగానే మందలించారు. అయినా సరే.. పార్టీ నేతల అవినీతికి మాత్రం బ్రేక్ పడలేదు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డు వేయాలని అధినేత చంద్రబాబు ఎంత ప్రయత్నం చేసినా సరే… సొంత పార్టీ నేతలే చంద్రబాబు మాటలను బేఖాతరు చేస్తున్నారు. ఇదీ కూటమి ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డపేరు వస్తోంది. అటు అధినేత మాట లెక్కచేయడం లేదు.. ఇటు కార్యకర్తకు మంచి చేయడం లేదు..దీంతో వీళ్ల కోసమా మనం పని చేసిందని తెలుగు తమ్ముళ్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.