Saturday, September 13, 2025 05:12 AM
Saturday, September 13, 2025 05:12 AM
roots

ఆర్జీవీ… ఇంత పిరికోడా…!

రాంగోపాల్ వర్మ… షార్ట్ కట్‌లో ఆర్జీవీ… తెలుగు సినిమాతో మొదలైన ప్రయాణం… బాలీవుడ్ వరకు సాగింది. సంచలన దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు కూడా. ఎన్నో హిట్లు… మరెన్నో కాంట్రవర్సీలు… క్లుప్తంగా ఇదీ ఆర్జీవీ. టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆర్జీవీ… ఇప్పుడు నోటి దూల… జగన్‌ పై వల్లమాలిన అభిమానం కారణంగా కెరీర్‌ను నాశనం చేసుకున్నాడనే చెప్పాలి. ఎన్నో ప్రయోగాలు చేసిన ఆర్జీవీ… జగన్ చెప్పాడంటూ… తెలుగుదేశం, జనసేన నేతలే టార్గెట్‌గా సినిమాలు తీయటం, వారిపై సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు పెట్టడం… కించపరిచేలా కామెంట్లు చేయడం… ఇలా చేయాల్సిన చెత్త పనులన్నీ చేసి ఇప్పుడు సుద్దపూస కబుర్లు చెబుతున్నాడు.

Also Read : వైఎస్ సునీత మనసులో ఏముంది?

టాలీవుడ్‌లో ప్రస్తుతం టాలెంట్ ఉన్న దర్శకుల్లో సగం మంది ఆర్జీవీ శిష్యులే. కానీ.. జగన్‌ పార్టీ అండ చూసుకుని రెచ్చిపోయిన వర్మ… ఇప్పుడు కొరివితో తల గొక్కున్నట్లు అయ్యింది. సరిగ్గా 2019 ఎన్నికల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఓ సినిమా తీశాడు. అందులో చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులను తప్పుగా చూపించాడనే కారణంతో దాని ప్రమోషన్‌ను ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ అభిమానులు అడ్డుకున్నారు. నాటి నుంచి టార్గెట్ టీడీపీ, చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోయాడు ఆర్జీవీ. 2019 ఎన్నికల్లో ఓడిన జనసేన పార్టీపైన సెటైరికల్ సినిమా తీశాడు. ఇక చంద్రబాబుపైన చేయకూడని విమర్శలన్నీ చేశాడు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ చేసిన పాపాల చిట్టాను బయటకు తీస్తున్నారు టీడీపీ అభిమానులు. వర్మ పైన ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. దీంతో విచారణకు రావాలని పోలీసులు 41ఏ నోటీసులిచ్చారు. అంతే.. అప్పటి వరకు సోషల్ మీడియాలో పులిలా రెచ్చిపోయిన వర్మ… ఒక్కసారిగా పిల్లి కంటే ఘోరంగా మారిపోయాడు. నన్ను కాపాడండి మహాప్రభో అంటూ హైకోర్టు మెట్లు ఎక్కేశాడు. తప్పుడు కేసు పెట్టారు… కొట్టేయ్యండి అంటూ పిటిషన్ వేశాడు. అది సాధ్యం కాదని కోర్టు చెప్పడంతో… విచారణకు తప్పకుండా హాజరవ్వాల్సి వచ్చింది.

Also Read : పుష్ప తో బ్లూ మీడియా కాళ్ళ బేరమా?

అయితే తప్పించుకునేందుకు ముందుగా లాయర్‌ను ఒంగోలు పంపాడు. షూటింగ్‌లున్నాయి… కాబట్టి రాలేను అంటూ లాయర్‌తో చెప్పించాడు. ఇప్పుడు మరోసారి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు. నా పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు… కాబట్టి బెయిల్ ఇచ్చి కాపాడండి… అంటూ బెయిల్ పిటిషన్ వేశాడు వర్మ. బాలీవుడ్‌లో మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో సత్య, కంపెనీ, సర్కార్ వంటి సినిమాలు తీసిన వర్మ… మాఫియా వచ్చినా నాకేం భయం లేదని గతంలో గొప్పగా ప్రకటించాడు. మాఫియానే లెక్కచేయని వర్మ… సైలెంట్‌గా ముంబై వదిలి హైదరాబాద్ వచ్చేశాడు. ఎవరికీ భయపడేది లేదని గొప్పగా చెప్పిన ఆర్జీవీ.. ఇలా 41ఏ నోటీసులకే భయపడటం ఏమిటని ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఆర్జీవీ ఇంత పిరికోడా అని తెగ ట్రోల్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్