రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఖాళీలు ఉన్నాయి అనే వార్త వచ్చిన దగ్గరనుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు వెళ్లే అవకాశం ఉందని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. రాజకీయ ప్రముఖులు చాలామంది రాజ్యసభకు వెళ్లడానికి ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రపతి కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జులైలో ఈ నాలుగు స్థానాలు ఖాళీ కాగా… దీనిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. జనవరిలోగా ఈ ఖాళీలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
Also Read : ఎవడు ఆపినా పోలవరం ఆపను… నా టార్గెట్ అదే: చంద్రబాబు
ఎవరిని ఎంపిక చేయాలి ఏంటి అనేదానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అలాగే బిజెపి జాతి అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాకపోయినా కొన్ని పేర్లు మాత్రం ఇప్పటికే బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి పేరు ప్రముఖంగా వినపడుతోంది. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరు కూడా చర్చల్లో ఉందని సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సహా బిజెపి అగ్రనేతలతో వెంకయ్య నాయుడుకి మంచి సంబంధాలు ఉన్నాయి.
దీనితో ఆయనను రాజ్యసభకు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. అలాగే తమిళనాడు నుంచి రజినీకాంత్ ను కూడా రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే రజనీకాంత్ ఈ మధ్యకాలంలో డిఎంకె పార్టీకి బాగా దగ్గరయ్యారు. తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టిన సమయంలో కూడా డీఎంకే పార్టీని ఎవరు ఏం చేయలేరంటూ కామెంట్స్ చేశారు. మరి ఆయనను ఎంపిక చేస్తారా లేదా అనేదానిపై మాత్రం స్పష్టత లేదు. అయితే ఈసారి కేరళ నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేకి రాజ్యసభలో అవకాశం కల్పించేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం.
Also Read : సోషల్ మీడియాను ఊపేస్తున్న చంద్రబాబు, పవన్
కేరళలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ… ఇప్పుడు కేరళ నుంచి ఓ అభ్యర్థిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వెంకయ్య నాయుడుని చిరంజీవిని మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపిక చేయడం ఖాయం అంటున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్నారు. దీనితో చిరంజీవిని రాజ్యసభకు పంపాలని కాస్త గట్టిగానే వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కూడా దీనికి అంగీకారం తెలిపారట. ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లిన సమయంలో దీనిపై చర్చ జరిగినట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.




