సాధారణంగా ఈ రోజుల్లో రాజకీయానికి కాదేది అనర్హం అన్నట్లు పరిస్థితి తయారయింది. ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయానికి వాడుకోవడం.. రాజకీయ పార్టీలపై విమర్శలు చేయడం అనేది రోజురోజుకీ పెరిగిపోతుంది. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు ఇలా ఏది జరిగినప్పటికీ ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే దానిని రాజకీయ పార్టీలకు ఆపాదించి.. మీ ప్రభుత్వం కారణంగానే ఇటువంటి ఘటన జరిగింది అంటూ విమర్శలు చేయడం చూస్తూనే ఉంటాం. చివరకు ఆత్మహత్య ఘటనలను కూడా ఇలాగే చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
Also Read : తెలుగు నటి అరుదైన రికార్డు.. ప్రగతి విజయగాథ!
అనారోగ్యంతో మరణించిన వాళ్ళ విషయంలో కూడా ఇదే ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. రోడ్లమీదకు మృతదేహాలను తీసుకువచ్చి ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. మరణించిన తర్వాత కూడా కనీసం గౌరవం ఇవ్వకుండా శవరాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విధానానికి ముగింపు పలికేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సిద్ధమైంది. శవ రాజకీయాలు చేసే వారికి చెంపపెట్టు లాంటి నిర్ణయాన్ని అక్కడి ప్రభుత్వం తీసుకుంది. శవాలను గౌరవించే చట్టాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ఆదివారం నుంచి అమలులోకి తీసుకువచ్చింది.
Also Read : సీన్ లోకి తమిళ హీరో..? అఖండకు లైన్ క్లియర్..?
ఈ చట్టం ప్రకారం.. శవంతో నిరసన కార్యక్రమాలు తెలపటం, శవాలను రాజకీయంగా వినియోగించడం, వంటి చర్యలను ప్రభుత్వం క్రిమినల్ నేరాలుగా పరిగణిస్తుంది. అలాంటి చేష్టలకు పాల్పడిన వారికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటుగా.. భారీ జరిమానా కూడా విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిని రోడ్ల మీద పడుకోబెట్టి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీనికి మీడియా కూడా హడావుడి ఎక్కువగానే చేస్తూ ఉంటుంది. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఇటువంటి చట్టం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలనే డిమాండ్లు వినపడుతున్నాయి.

