Saturday, September 13, 2025 07:10 AM
Saturday, September 13, 2025 07:10 AM
roots

కెన్యా మృగాల మధ్యన జక్కన్న

ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియన్ సినిమాకు తాను ఏంటీ అనేది మరోసారి ఓ రేంజ్ లో ప్రూవ్ చేసాడు రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి సినిమాలంటే బాలీవుడ్ హీరోలు కూడా ఎదురు చూసే పరిస్థితి. ఇండియా వైడ్ గా జక్కన్నకు క్రేజ్ బాహుబలి తర్వాత పెరిగినా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అది డబుల్ అయింది. అందుకే ఇప్పుడు జక్కన్న తర్వాతి ప్రాజెక్ట్ లపై సీరియస్ గా ఫోకస్ చేస్తున్నాడు. మహేష్ బాబు సినిమాతో హాలీవుడ్ లో కూడా తన మార్క్ ను గ్రాండ్ గా చూపించాలని జక్కన్న పట్టుధలగానే ఉన్నాడు.

అందుకే మహేష్ సినిమా కోసం ఇప్పుడు వర్క్ గట్టిగా చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా అందరూ అనుకున్నట్టే… విదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నాడు. కెన్యా అడవుల్లో మహేష్ సినిమాను షూట్ స్టార్ట్ చేయడానికి లోకేషన్ ను ఫైనల్ చేసేందుకు వెళ్ళాడు జక్కన్న. తాజాగా దీనికి సంబంధించి ఒక ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అంబోసెలి నేషనల్ పార్క్ లో తాను ఉన్నట్టు జక్కన్న ఫోటో పోస్ట్ చేయగా… ఆ ఫోటోలో క్రూర మృగాలు ఉన్నాయి.

Also Read: బాలయ్య కోసం కత్తిలాంటి కథ సిద్ధం చేసిన పూరీ..!

ఈ పార్క్ లో సింహాలు, హైనాలు సహా ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి. బ్లాక్ మాంబా వంటి విషపూరిత పాములకు కూడా ఈ పార్క్ నిలయంగా ఉంది. అలాంటి పార్క్ లో మహేష్ తో షూట్ చేయడానికి జక్కన్న రెడీ అయ్యాడు. దీనితో సినిమాను ఏ రేంజ్ లో ప్లాన్ చేసి ఉండవచ్చు అంటూ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. రెండు పార్ట్ లుగా వచ్చే ఈ సినిమా మొదటి పార్ట్ షూట్ ను జనవరి లో సంక్రాంతి తర్వాతి నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా ఉండే ఛాన్స్ ఉందని సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్