రాజాసాబ్.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసిన సినిమా. ఎప్పుడో దసర పండుగకు రావాల్సిన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేశారు. అయితే తొలి నుంచి ఈ సినిమాపైన మేకర్స్ ఎంతో హైప్ క్రియేట్ చేశారు. ఒకరేమో ఇది రూ.2 వేల కోట్లు కలెక్ట్ చేస్తుందంటే.. మరొకరేమో.. ఇది ఇండస్ట్రీకే సెన్సెషన్ అన్నారు. ఇక దర్శకుడు మారుతి అయితే.. సినిమా నిరాాశకు గురి చేస్తే.. తన ఇంటికి రావాలంటూ.. ఇంటి అడ్రస్ చెప్పారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా అంతంత మాత్రమే అని తెలియటంతో.. ఫ్యాన్స్ నిరాశ పపడ్డారు.
Also Read :రెండు పాత్రల్లో నట సింహం గర్జన..? బాలయ్యను వాడేస్తున్న డైరెక్టర్..!
రాజాసాబ్ ఫ్లాప్ టాక్ రావడంతో.. ప్రభాస్ అభిమానులు దర్శకుడు మారుతిపై అసహనం వ్యక్తం చేశారు. మారుతి ఇంటికి వందల కొద్ది ఫుడ్ పార్సిల్స్ ఆర్డర్ పెట్టారు. అయితే రాజాసాబ్ గురించి రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో మోత మోగిపోతోంది. ఇంకా చెప్పాలంటే.. దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. రాజా సాబ్ థియేటర్లలో విడుదలైన పది రోజులకే మారిపోయింది. నెల రోజులు కూడా కాక ముందే ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో థియేటర్లలో రిలీజ్ అయినప్పటికంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో రాజా సాబ్ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు.
రాజా సాబ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. రిలీజ్‌కు ముందే జియో హాట్ స్టార్‌పై సెటైర్లు వేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఫ్రేమ్ పట్టి పట్టి చూస్తున్నారు. సినిమకు సంబంధించిన స్రీన్ షాట్లు, వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది ప్రభాస్ యాక్టింగ్ పైన విమర్శలు చేస్తుంటే.. మరికొందరేమో.. దర్శకుడు మారితిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభాస్ నటన అంచనాలకు తగినట్లు లేదంటున్నారు. కొందరేమో.. గ్రాఫిక్స్ ఇంకా బాగా చేయాల్సి ఉందంటున్నారు. అసలు ఇది ప్రభాస్ చేయాల్సిన సినిమా కాదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read :ట్రంప్ మెప్పు కోసమేనా..? రష్యా ఆయిల్ భారత్ కొనాల్సిందే..?
చాలా మంది మాత్రం తమ కోపాన్ని ఎక్కువగా మారుతి రచనపైనే చూపిస్తున్నారు. స్క్రీన్ ప్లే బలహీనంగా ఉందని, ముఖ్యంగా మొదటి అర్ధభాగం అనవసరంగా సాగతీశారంటున్నారు నెటిజన్లు. సరదాగా, యూత్‌ఫుల్‌గా, మీడియం బడ్జెట్‌తో ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంతోనే మంచి పేరు తెచ్చుకున్న మారుతి, ప్రభాస్ లాంటి స్టార్‌తో తనకు లభించిన పెద్ద అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడని చాలా మంది అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒకసారి తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. ఇప్పుడు ఓటీటీ విడుదలతో, ట్రోలింగ్ మళ్లీ మొదలైంది. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు హద్దులు దాటుతున్నాయి. అభ్యంతరకరమైన కంటెంట్ కూడా షేర్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే, మారుతి మరి కొంతకాలం సినిమాల నుంచి దూరంగా ఉండటం తప్ప వేరే మార్గం లేనట్లు కనిపిస్తోంది.

