ఓటు చోరీ అంశంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ఇబ్బంది పెట్టే దిశగా అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. పదే పదే రాహుల్ ఓటు చోరీ విషయంలో ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఓటర్లను ఏ విధంగా తొలగించారో రాహుల్ ఉదాహరణలతో సహా చూపించారు. ముఖ్యంగా కర్ణాటకలో ఓ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఓట్లు ఎలా తొలగించారో వివరించారు. ఓటర్లను కూడా వేదికపైకి తీసుకొచ్చారు రాహుల్.
Also Read : పాకిస్తాన్ కు ఐసీసీ షాక్.. భారీ జరిమానా..?
ఇక నిన్న సాయంత్రం ఆయన చేసిన ఓ ట్వీట్ మరింత సంచలనం అయింది. దేశంలో నేపాల్ తరహాలో జెన్ జీ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. యువతను కలుపుకుని తాను ఉద్యమం చేస్తానని, ఓటు చోరీ విషయంలో ప్రజల్లోకి వెళ్తానని కామెంట్ చేసారు. దీనితో రాహుల్ ప్రణాళిక ఏం కాబోతోంది అనేది ఆసక్తిగా మారింది. బీహార్ ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా రాహుల్ ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చే అవకాశం కనపడుతోంది. దేశ వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది.
Also Read : సిట్ తర్వాత ఈడీ..? మిథున్ రెడ్డి కేంద్రగా కీలక దర్యాప్తు..!
కాలేజీలతో పాటుగా పలు వేదికల్లో యువతను కలుపుకుని ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రణాళిక సిద్దం చేస్తోంది. జోడో యాత్ర మాదిరిగా కేరళ నుంచి ఈ యాత్రను మొదలుపెట్టనున్నారు. బలం కోల్పోయిన దక్షిణాది రాష్ట్రాల్లో తిరిగి పుంజుకునే విధంగా రాహుల్ యాత్ర ఉండనుంది. జోడో యాత్ర మాదిరిగా హడావుడిగా యాత్ర చేయకుండా, రెండేళ్ళ పాటు దేశం మొత్తం పర్యటించే విధంగా రాహుల్ ప్లాన్ చేస్తున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహించడమే కాకుండా ప్రతిపక్షాల ఓట్లను ఏ రాష్ట్రంలో ఏ విధంగా తొలగించారో రాష్ట్రాల వారీగా ఆధారాలను చూపించనున్నారు రాహుల్.