Wednesday, February 4, 2026 04:07 PM
Wednesday, February 4, 2026 04:07 PM

గాయం సాకు.. రంజీలకు దూరంగా రాహుల్, కోహ్లీ..?

గత కొన్నాళ్ళుగా ఫాంలో లేక ఇబ్బందులు పడుతున్న టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి.. రంజీ సీజన్ కు దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ రంజీ ట్రోఫీ తర్వాతి రౌండ్ కు దూరంగా ఉంటున్నారు. తాము గాయాల కారణంగా ఇబ్బంది పడుతున్నామని… జనవరి 23 నుండి ప్రారంభమయ్యే మ్యాచ్‌లలో పాల్గొనలేమని బోర్డుకు సమాచారం పంపారట. కోహ్లీ మెడ నొప్పి కారణంగా ఈ సీజన్ కు దూరం అవుతున్నట్టు తెలిపాడు.

Also Read : ఫౌజీ షురూ చేసిన రెబల్ స్టార్

ఇక రాహుల్‌కు మోచేతి సమస్య ఉంది. తద్వారా పంజాబ్‌తో జరగబోయే కర్ణాటక మ్యాచ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో చాలా మంది భారత స్టార్ ఆటగాళ్ళు పాల్గొంటున్నారు. రిషబ్ పంత్ (ఢిల్లీ), శుభ్‌మన్ గిల్ (పంజాబ్), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర). ఇక ఆటగాళ్ళ తీరుపై బోర్డు సీరియస్ గా ఉంది. ఆటగాళ్ళు క్రికెట్ టూర్స్ లో వ్యక్తిగత సిబ్బందిని అలాగే కుటుంబాలను దూరంగా పెట్టాలని బోర్డ్ స్పష్టం చేసింది. 10-పాయింట్ పాలసీలో క్రమశిక్షణకు బోర్డు ప్రాధాన్యత ఇచ్చింది.

Also Read : జనాభా పెరగాలి.. నేషనల్ మీడియాలో చంద్రబాబు కామెంట్స్ వైరల్..!

ఈ పాలసీకి కట్టుబడి ఉండకపోతే సెంట్రల్ కాంట్రాక్టుల నుండి వారిని తప్పించడమే కాకుండా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ లో పాల్గొనకుండా నిషేధం విధించాలని భావిస్తోంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్ వైట్‌వాష్‌, ఆస్ట్రేలియాలో ఘోర ఓటమి నేపధ్యంలో జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఏవైనా మినహాయింపులు ఉంటె కోచ్ ద్వారా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రదర్శన సరిగా లేకపోతే మ్యాచ్ ఫీజులో కొత విధించాలని కూడా బోర్డ్ భావిస్తోంది. దేశవాళి క్రికెట్ పై కూడా బోర్డ్ ఫోకస్ పెడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్