అంతర్జాతీయ క్రికెట్లో 35 ఏళ్లు దాటిన తర్వాత ఎప్పుడు రిటైర్ అవుతారు.. అంటూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా స్టార్ ఆటగాళ్ళ విషయంలో ఇది ఎక్కువగా వినపడుతుంది. ఒక్కసారి ఫామ్ కోల్పోయిన తర్వాత.. వాళ్ళు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిందే అనే అభిప్రాయాలను అభిమానులు కూడా సోషల్ మీడియాలో లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్తూ ఉంటారు. ఇప్పుడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో ఇలాగే ప్రచారం జరుగుతుంది.
Also Read : అభిమానులను వెంటాడే భయం ఇదే..!
గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ.. అలాగే విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా.. ముగ్గురు టి20 ఫార్మేట్ కు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ట్రోఫీ ముగిసిన వెంటనే రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ అలా ఏమీ జరగలేదు. రిటైర్మెంట్ తాను అవ్వట్లేదు అని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతానికి అయితే తాను వన్డేలకు గుడ్ బాయ్ చెప్పడం లేదని, ఎలాంటి గాసిప్స్ వద్దని రిక్వెస్ట్ చేశాడు.
Also Read : ఇలా అయితే కష్టమే.. బాబు మాస్ వార్నింగ్..!
దీనితో ఇప్పుడు 2027 వన్డే ప్రపంచ కప్ రోహిత్ శర్మ ఆడతాడా అనేదానిపై క్లారిటీ రావటం లేదు. అప్పటివరకు అతను జట్టులో ఉంటాడా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అయితే రోహిత్ శర్మ ఫిట్నెస్ కొనసాగిస్తే.. వచ్చే వరల్డ్ కప్ ఆడటం పెద్ద కష్టమేమి కాదు. సచిన్ టెండూల్కర్, సనత్ జయ సూర్య వంటి వాళ్ళు 40 ఏళ్ళు వచ్చేవరకు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగారు.
Also Read : ఐపిఎల్ కు కేంద్రం షాక్.. ఆ ప్రకటనలు అన్నీ బ్యాన్
దీనితో రోహిత్ శర్మ కూడా అప్పటి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతోంది. వచ్చే వరల్డ్ కప్ నాటికి భారత జట్టు 27 వన్డే మ్యాచ్ లు ఆడుతుంది. ఇందులో మూడు వన్డేలు చొప్పున 9 సీరిస్ లు ఉన్నాయి. ప్రస్తుతం ఫిట్నెస్ పరంగా రోహిత్ శర్మకు ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా అతను ఎంతవరకు రాణిస్తాడు అనే దానిపైనే ఆసక్తి నెలకొంది.