Friday, September 12, 2025 08:48 PM
Friday, September 12, 2025 08:48 PM
roots

ఆ విషయంలో అంత తొందర ఎందుకు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంకా చెప్పాలంటే అమరావతి నిర్మాణంపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు ప్లాన్. టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలనే లక్ష్యంతోనే తొలి నుంచి చంద్రబాబు పని చేస్తున్నారు కూడా. ఇదే మాటను పదే పదే చెబుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా లాండ్ పూలింగ్ విధానం ద్వారా ఎలాంటి వివాదం రాకుండా 33 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. చంద్రబాబు మీద నమ్మకంతోనే భూములను స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు రైతులు స్పష్టం చేశారు. అమరావతి భూతల స్వర్గం అంటూ అంతర్జాతీయ స్థాయి సంస్థలతో డిజైన్లు రూపొందించారు. అలాగే పెద్ద పెద్ద భవనాలు వస్తాయని కూడా చూపించారు. వీటిపై అప్పట్లోనే గ్రాఫిక్స్ నగరం అనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయినా సరే చంద్రబాబు మాత్రం.. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు.

Also Read : కరేడు రైతుల పోరాటంలో వైసీపీ ఎటువైపు..!

అప్పట్లో కొన్ని భవనాలను చంద్రబాబు సర్కార్ మొదలుపెట్టింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులకు చెందిన నివాస సముదాయాలను ప్రారంభించారు. అలాగే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఈ పనులన్నీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయాయి. చివరికి సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం సిద్ధం చేసిన పైపులను కూడా దొంగలెత్తుకెళ్లారు. అమరావతి పనులు అటకెక్కాయి. ఇదే సమయంలో 3 రాజధానులంటూ విచిత్రమైన ప్రతిపాదన తెరపైకి రావడంతో.. గందరగోళం చెలరేగింది. విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో.. ఏపీకి రాజధానిగా అమరావతి ఉంటుందా ఉండదా అనే అనుమానం కూడా వచ్చింది. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అమరావతి పనులు మళ్లీ మొదలయ్యాయి. కానీ ఇక్కడే ఎన్నో అనుమానాలు.

Also Read : పదేళ్లు.. 15 ఏళ్లు.. హాట్ హాట్ పాలిట్రిక్స్..!

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే నాటికి అమరావతిలో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాస భవనాలు 80 శాతం పూర్తయ్యాయని టీడీపీ నేతలే వెల్లడించారు. మిగిలిన 20 శాతం పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు కూడా. కానీ ఏడాది దాటినా కూడా ఇప్పటికీ వాటి పరిస్థితి ఏమిటో తెలియదు. మంత్రులు, ప్రజాప్రతినిధులంతా విజయవాడ, గుంటూరులో గెస్ట్ హౌస్‌లలో ఉంటూ భారీగా అద్దె వసూలు చేస్తున్నారు. ఇక సీఆర్‌డీఏ కార్యాలయం నిర్మాణ పనులు ముందుకు సాగటం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఆర్‌డీఏ కార్యాలయం సందర్శించిన చంద్రబాబు.. వంద రోజుల్లోనే పనులు పూర్తిచేస్తామన్నారు. మార్చి 25, 2025 నాటికి పనులు పూర్తవుతాయని.. ఏప్రిల్ ఒకటి నుంచే సీఆర్‌డీఏ కార్యాలయంలో విధులు కొనసాగుతాయన్నారు. కానీ ఆ గడువు ముగిసి ఇప్పటికి మరో వంద రోజులు దాటింది. అయినా సరే.. ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.

Also Read : జగన్‌లో ఎంత మార్పు వచ్చిందో..!

కేవలం 3.62 ఎకరాల్లో చేపట్టిన 7 అంతస్తుల భవనాన్నే పూర్తి చేయలేకపోతున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మరో 40 వేల ఎకరాలు ఇస్తే అద్భుతమైన నగరాన్ని, విశాలమైన ఎయిర్ పోర్టు, స్పోర్ట్ సిటీ నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఓ వైపు వైసీపీ నేతలు ఒకమాటను పదే పదే చెబుతున్నారు. తమ నాయకుడు చెప్పాడంటే.. చేస్తాడంతే అంటున్నారు. అందుకు రుజువులు కూడా ఉన్నాయంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం.. చెప్పడం వరకే తప్ప.. చేసేది ఏమీ లేదని ఎద్దేవా చేస్తున్నారు. ఇన్ని విమర్శలు చేస్తున్నా సరే.. ప్రభుత్వం మాత్రం తమ ధోరణిలోనే ముందుకు సాగుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలలు గడిచినా కూడా కనీసం ఒక్క పని కూడా పూర్తి చేయకపోవడం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. అమరావతి పరిపాలన పర్యవేక్షించే సీఆర్‌డీఏ భవనాన్నే సకాలంలో పూర్తి చేయలేని కూటమి సర్కార్.. 2027 నాటి అమరావతి ఫస్ట్ ఫేజ్ పనులు ఎలా పూర్తి చేస్తుందనే ప్రశ్న ఇప్పుడు బాగా వినిపిస్తోంది. అసలు ఫస్ట్ ఫేజ్ కూడా పూర్తి కాకుండానే.. మలి విడతలో ఏకంగా 40 వేల ఎకరాల భూమి సేకరించాలని ఎందుకు తొందర పడుతున్నారని కూడా నిలదీస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్