ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ ను లైట్ తీసుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏపీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్డియేలో టీడీపీ తిరిగి జాయిన్ అయిన తర్వాత.. ఎన్నికల్లో గెలవడం, ప్రభుత్వంలో భాగం కావడంతో బిజెపి దూకుడు పెంచింది. ఇటీవల పార్టీ సీనియర్ నేత మాధవ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బిజెపి ఎంపిక చేసింది. ఇక్కడి నుంచి రాష్ట్రంలో పట్టు పెంచుకోవాలని ఆ పార్టీ అగ్ర నేతలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే భారీ బహిరంగ సభ కూడా నిర్వహించే దిశగా బిజెపి అధిష్టానం అడుగులు వేస్తోంది.
Also Read : శంకర్ కు సాధ్యంకాని విజయం శేఖర్ కు ఎలా సాధ్యమైంది?
హిందూ సమాజాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు బిజెపి అగ్ర నేతలు. ఈ క్రమంలోనే తాజాగా మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మాధవ్.. బెజవాడలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం సందర్భంగా ర్యాలీ మధ్యలో ఆయన మాట్లాడారు. బెజవాడ నడిబొడ్డులో మాట్లాడిన ఆయన.. విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చి కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలని కోరారు.
Also Read : తిరుమల శ్రీవారి భక్తులకు మరో శుభవార్త..!
మన భారతదేశానికి ఎటువంటి సంబంధం లేనప్పుడు లెనిన్ పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు మాధవ్. మన భాష కోసం నిరంతరం శ్రమించిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కవి సామ్రాట్ విగ్రహానికి మాధవ్ తో పాటు బిజెపి నేతలు పెద్ద ఎత్తున నివాళులర్పించి.. లెనిన్ సెంటర్ పేరు మార్చాలని డిమాండ్ చేసారు. ఉత్తరాదిలో ఈ పేర్ల మార్పు రాజకీయం బిజెపి చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాదిలో పలు నగరాలకు పేర్లు మార్చింది.