Friday, September 12, 2025 05:21 PM
Friday, September 12, 2025 05:21 PM
roots

దేవర రికార్డ్స్ పై గురిపెట్టిన పుష్ప 2

ఇండియన్ సినిమా ఫ్యాన్స్ ఇప్పుడు పుష్ప 2 కోసం ఎంతో ఆశగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా సీక్వెల్ పై ఈ రేంజ్ లో అంచనాలు లేవు అనే చెప్పాలి. పార్ట్ 1 సూపర్ హిట్ అయినా పార్ట్ 2 బ్లాక్ బస్టర్ అనే ధీమాతో బన్నీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందుకే ప్రమోషన్స్ విషయంలో ఇప్పుడు పక్కా ప్లాన్ తో దిగుతోంది పుష్ప టీం. పుష్ప 2 ప్రమోషన్స్ ను ఇప్పటికే ఇండియా వైడ్ గా ప్లాన్ చేసారు. అన్ని నార్త్ స్టేట్స్ లో ఈవెంట్స్ చేయడానికి రెడీ అయ్యారు. అమెరికా ఆస్ట్రేలియాలో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నారట.

Also Read : కేతిరెడ్డికి మ్యూజిక్ స్టార్ట్…?

ఇక అమెరికాలో ఇప్పటికే ప్రీ బుకింగ్ స్టార్ట్ అయింది. సినిమా విడుదల కోసం ఇంకా 28 రోజులు ఉండగానే క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ప్రీ బుకింగ్ స్టార్ట్ చేసారు. అప్పుడే దాదాపు 20 వేల టికెట్ లు ఒక్క రోజులో అమ్ముడు అయ్యాయి. ఈ జోరు చూస్తుంటే ఈ 28 రోజుల్లో సినిమా భారీగా వసూలు చేసే ఛాన్స్ కనపడుతోంది. త్వరలోనే సినిమా రిలీజ్ అయ్యే అన్ని దేశాల్లో ప్రీ బుకింగ్ ఓపెన్ చేస్తారు. దీనితో సినిమా ఇప్పుడు కచ్చితంగా దేవర రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. అమెరికాలో దేవర భారీగా ప్రీ బుకింగ్ మార్కెట్ చేసింది.

Also Read : తోక ముడిచి.. ఆరోపణలు ఫేక్ అని ఒప్పుకున్న వైసీపీ..!

సినిమా రిలీజ్ కంటే ముందే దాదాపు మూడు మిలియన్లు వసూలు చేసింది. ఇప్పుడు పుష్ప జోరు చూస్తుంటే అంతకు మించి వసూలు చేయడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. ఇక పుష్ప టీం అమెరికాలో ఓ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తోంది. ట్రైలర్ రిలీజ్ కాక ముందే క్రేజ్ ఇలా ఉంటే రిలీజ్ అయితే ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మన దేశంలో డిసెంబర్ 5 న సినిమా రిలీజ్ అయితే ఓవర్సీస్ లో ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 4న సినిమాను రిలీజ్ చేయనున్నారు. చూద్దాం ఏ రికార్డులు బ్రేక్ అవుతాయో.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్