Friday, September 12, 2025 05:16 PM
Friday, September 12, 2025 05:16 PM
roots

అనుకున్నంత గొప్పగా ఏం లేదు…!

అనుకున్నంత గొప్పగా ఏం జరగలేదు… ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. హైదరాబాద్‌లో జరిగిన పుష్పా 2 ఈవెంట్‌పై ఇప్పుడు టాలీవుడ్‌ వర్గాల్లో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌, 12,500 స్క్రీన్లు… ఇలా హంగామా చేశారు తప్ప… ఫంక్షన్‌ విషయంలో మాత్రం అభిమానులు పెద్దగా సంతృప్తిగా లేరు. యూసుఫ్‌గూడ పోలీస్‌గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌ సాదాసీదాగానే సాగిపోయింది. సాయంత్రం 4 గంటల నుంచే అభిమానులను గ్రౌండ్‌లోకి అనుమతించినప్పటికీ… రాత్రి 7.30 గంటల వరకు ఈవెంట్‌ స్టార్ట్‌ చేయలేదు. ఇక స్టేజ్‌ అంత ఎత్తున కట్టడం… పైన ఎవరు మాట్లాడుతున్నారనే కింద ఉన్న వారికి కనిపించకపోవడం పెద్ద మైనస్.

Also Read :అరబిందోకి మూడింది, రంగంలోకి సిఐడీ, పవన్ హడావుడి వర్కౌట్ అయిందా…?

వాస్తవానికి సినిమా ఈవెంట్‌ అంటే స్టార్లు వస్తారనేది ఫ్యాన్స్‌ ఆశ. ఒకరికిద్దరు వస్తారని గంపెడంత ఆశతో ఫంక్షన్లకు వస్తారు. కానీ పుష్పా 2 విషయంలో మాత్రం అలా జరగలేదు. వన్‌ మ్యాన్‌ షో అన్నట్లుగా సాగింది. జక్కన్న రాజమౌళి తప్ప… ఏ స్టార్ హీరో కూడా ఫంక్షన్‌కు రాలేదు. అల్లు అర్జున్ వేదికపైకి వచ్చిందే రాత్రి 9.30 గంటలకు. అప్పటికే చాలా మంది వర్షం పడుతుందనే భయంతో వెళ్లిపోయేందుకు రెడీ అయ్యారు. పది గంటల వరకు మాత్రమే జరగాల్సిన ఈవెంట్… అర్థరాత్రి వరకు సాగింది. ట్రాఫిక్‌ సమస్యలు, వర్షం భయంతో ముందుగానే సగం మంది వెళ్లిపోయారు. ఇక సినిమాలో పనిచేసిన వారిలో హీరోయిన్ రష్మిక, శ్రీలీల, అనుసూయ తప్ప మరెవరూ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో ఇదేం సినిమా ఫంక్షన్ అనే మాట వేదిక కిందే వినిపించింది. కనీసం ఒక్క యాక్టర్ కూడా ఈ ఫంక్షన్‌కు రాలేదు.

Also Read :అదానితో ఒప్పందం రద్దు అయితే, పెనాలిటీ ఎన్ని వేల కోట్లంటే…!

ఇక మాట్లాడిన ఆ నలుగురు కూడా బన్నీ సూపర్ సుకుమార్ సూపర్ అనటంతోనే సరిపోయింది. ఏదో ఒకరిద్దరు ఫ్యాన్స్ అరుపులు, కేకలు తప్ప… ఈవెంట్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. పాట్నా ఫంక్షన్ చూసిన సినీ విశ్లేషకులు… హైదరాబాద్ ఫంక్షన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అన్నీ తల్లకిందులు అయ్యాయి. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఒక్కరు కూడా హాజరవ్వలేదు. సుకుమార్ సినిమాల హీరోలు కూడా ఈ ఈవెంట్‌కు హ్యాండ్ ఇచ్చారు. దీంతో పుష్పా 2 ప్లీ రిలీజ్ ఈవెంట్ మాత్రం… అనుకున్నంత గొప్పగా ఏం జరగలేదు అని బన్నీ ఫ్యాన్స్ సైతం అంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్