Friday, September 12, 2025 11:10 PM
Friday, September 12, 2025 11:10 PM
roots

పోయిరా నేస్తమా… రాజకీయ గురువుకు కన్నీటి వీడ్కోలు..!

కష్టసుఖాల్లో అండగా ఉండేది స్నేహితుడు. స్నేహానికి మించిన బలం మరొకటి ఉండదు. స్నేహితం అనేది ఓ బలమైన అనుభూతి. దీనికి వయసుతో నిమిత్తం ఉండదు. మేలు చేసిన వారిని మరవకూడదు అనేది స్నేహితం నేర్పిస్తుంది. బంధువులు లేని వారు ఉండొచ్చేమో కానీ… స్నేహితుడు లేని వారు ఉండరు. రాజకీయాల్లో కూడా ఓ గురువు ఉంటారనడంలో అతిశేయోక్తి కాదు. ఈ రెండు గుణాలతో అనుబంధం ఏర్పరుచుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వేదనకు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యం కారణంగా మృతి చెందారు.

రామ్మూర్తి నాయుడికి పులవర్తి నానికి మధ్య దాదాపు 20 ఏళ్ల తేడా ఉంది. అయినా సరే వీరిద్దరూ మంచి స్నేహితులు. రామ్మూర్తి నాయుడుని పులవర్తి నాని రాజకీయ గురువుగా భావిస్తారు. అందుకే చాలా సందర్భాల్లో గురువు గారు అంటూనే పిలుస్తారు నాని. 1994లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి రామ్మూర్తి నాయుడు గెలవడం వెనుక పులవర్తి నాని కృషి ఉంది. అంతకు ముందు నుంచే ఈ ఇద్దరు కలిసే పనిచేస్తున్నారు. నాని రాజకీయంగా ఎదగటంలో రామ్మూర్తి నాయుడు కీలక పాత్ర పోషించారు.

రామ్మూర్తి నాయుడు మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటంటూ పులవర్తి నాని కన్నీరు పెట్టుకున్నారు. గురువు, స్నేహితుడు ఇలా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడంటూ భోరున ఏడ్చేశారు. రామ్మూర్తి నాయుడు భౌతిక కాయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట తీసుకువచ్చారు. అక్కడ నుంచి నారా వారి పల్లెకు అంబులెన్స్ లో తీసుకెళ్లారు. రేణిగుంట నుంచి నారా వారి పల్లె వరకు అంబులెన్స్ లోనే ప్రయాణం చేశారు నాని. ఇంటి దగ్గర కూడా స్వయంగా అంబులెన్స్ లో నుంచి వేదిక వరకు తీసుకొచ్చారు. క్రతువు ముగిసే వరకు అక్కడే ఉన్నారు పులవర్తి నాని. చంద్రగిరి నియోజకవర్గంలో తనను నడిపించే నేత లేరంటూ సన్నిహితుల దగ్గర భావోద్వేగానికి గురయ్యారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్