Friday, September 12, 2025 05:18 PM
Friday, September 12, 2025 05:18 PM
roots

తల్లికి వందనంపై విమర్శలు అందుకే రాలేదా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. సూపర్ సిక్స్ లో భాగంగా తాజాగా తల్లికి వందనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. తల్లుల ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రాష్ట్ర ప్రభుత్వం 13 వేల రూపాయలు చొప్పున అందించింది. ముందు 15000 అని ప్రకటించిన ఆ తర్వాత 13 వేల రూపాయలను జమ చేశారు. రాబోయే విద్యా సంవత్సరానికి ఫీజుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని జమ చేసింది.

Also Read : ఆ విషయంలో అన్నకు చెల్లి మద్దతు..!

ఈ కార్యక్రమం విషయంలో వైసీపీ గతంలో ఎన్ని ఆరోపణలు చేసినా.. పక్కాగా అమలు చేసేందుకు చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రణాళిక ప్రకారం వెళ్ళింది. 67 లక్షల మందికిపైగా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు. ఎటువంటి షరతులు లేకుండా అందరికీ జమ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 8500 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అయితే ఇక్కడ వైసిపి నుంచి విమర్శలు వస్తాయని చాలామంది ఎదురు చూశారు. 13 వేల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేయడాన్నీ వైసిపి నేతలు వాడుకునే అవకాశం ఉందని భావించారు.

Also Read : తన్నుకున్నారు.. కలిశారు.. బకరా చేశారు..!

కానీ పథకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో విమర్శలు రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై వైసీపీ కార్యకర్తలు పెద్దగా రియాక్ట్ కాలేదు. ఇక ప్రజలు కూడా ఎక్కడా సోషల్ మీడియాలో దీనిపై నెగిటివ్ కామెంట్లు కూడా చేసిన పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం ఎటువంటి షరతులు లేకుండా డబ్బులు జమ చేయడమే. ఇద్దరు పిల్లలుంటే 26 వేల రూపాయలను జమ చేశారు. ముగ్గురు పిల్లలు ఉంటే 39వేల రూపాయలు జమయ్యాయి. గతంలో ప్రభుత్వ స్కూల్స్ లేదంటే ప్రైవేట్ స్కూల్స్ అంటూ షరతులు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అటువంటివి ఏమీ లేకుండా జమ చేయడంతోనే ప్రజల నుంచి వ్యతిరేకత రావడం లేదనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్