ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఎంత మంది వచ్చి ఉండవచ్చు…? బాహుబలి పార్ట్ 2 ఈవెంట్ అంటే ఎంత మంది వచ్చి ఉండొచ్చు…? ఆర్ఆర్ఆర్ కు మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్, రాజమౌళి సినిమాలు అంటే పిచ్చి ఉన్న వాళ్ళు భారీగానే వస్తారు. వాటిని ఎంతో సమర్ధవంతంగా హ్యాండిల్ చేసారు నిర్వాహకులు. అలాంటిది… అలాంటిది… దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హ్యాండిల్ చేయలేకపోయారు. ఎస్… హ్యాండిల్ చేయలేక ఈవెంట్ ను రద్దు చేసారు. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మంట ఎక్కిపోయిన మాట ఇది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఎక్కడి నుంచో ఫ్యాన్స్ వస్తూ ఉంటారు. ఎన్టీఆర్ ఏం చిన్న హీరో కాదు… ఆరేళ్ళ తర్వాత సోలోగా సినిమా చేస్తున్నాడు. అంటే ఫ్యాన్స్ భారీగా వస్తారు. సినిమాకు ఇప్పటికే భారీగా బజ్ క్రియేట్ అయింది. మరి ఎంత పక్కా ప్లాన్ తో ఉండాలి…? అదేం లేదు. నోవోటేల్ హోటల్ లో సామర్ధ్యంకు మించి పాస్ లు ఇచ్చేసారు. హ్యాండిల్ చేయలేక ఈవెంట్ క్యాన్సిల్ చేసారు. ఫ్యాన్స్ అన్నీ కంట్రోల్ చేసుకుని వెళ్ళారు గాని… దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందనే విషయం ఇప్పుడు కొన్ని కొన్ని కామెంట్స్ చూస్తుంటే అర్ధమవుతోంది.
Read Also : “దేవర”ను వెంటాడుతున్న నెగటివ్ వైబ్స్
ఈ ఈవెంట్ ను ప్లాన్ ప్రకారమే క్యాన్సిల్ చేసారని… సినిమాకు ప్రమోషన్ ఈ రూపంలో చేసారని సినిమాకు భారీ క్రేజ్ ఉందనే సిగ్నల్స్ జాతీయ స్థాయిలో ఇవ్వడమే దీని వెనుక ఉద్దేశం అంటున్నారు జనాలు. ఎన్టీఆర్ కు ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది, సినిమా భారీ అంచనాలతో వస్తుంది అని హైప్ క్రియేట్ చేయడమే దీని వెనుక ప్లాన్ అని వార్తలు వస్తున్నాయి. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేయాల్సిన ట్రైలర్ ను ముందే ఎందుకు విడుదల చేసారు అనేది కూడా ప్రధాన ప్రశ్న. ఎన్టీఆర్ బారికేడ్ల మధ్య ప్రసంగం వెనుక వ్యూహం కూడా అదే అంటున్నారు జనాలు. ఇప్పటికే ఓవర్సీస్ లో క్రియేట్ అవుతున్న బజ్… మన దేశంలో కూడా పెంచడమే చిత్ర యూనిట్ ప్లాన్ అంటున్నారు జనాలు.