సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాక ముందే.. దానిపై పుకార్లు షికారు చేస్తున్నాయి. షూటింగ్ ప్రారంభం కాక ముందు నుంచే సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభం కూడా కాక ముందే.. కొత్త సమస్యలు తలెత్తుతున్నట్లు కనిపిస్తోంది. దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు గతంలో వార్తలు వచ్చిన తర్వాత, సృజనాత్మక విభేదాల కారణంగా ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ నుండి కొత్త వార్తలు వస్తున్నాయి. నిజానికి స్పిరిట్ సినిమాకు ఈ స్థాయి హైప్ రావడానికి ఒక విధంగా ప్రకాష్ రాజ్ కారణం. స్పిరిట్ ఆడియో క్లిప్‌లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్స్ కారణంగా ఈ సినిమాపై హెవీ బజ్ క్రియేట్ అయ్యింది.
Also Read : మారుతిని వదలని రాజా సాబ్..!
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ చేస్తున్న సినిమ స్పిరిట్. ప్రకాష్ రాజ్ స్పిరిట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడని, సినిమా లాంచ్ వీడియోలో ఆయన వాయిస్ ఇప్పటికే హెవీ హైప్ సృష్టించింది. అయితే, టాలీవుడ్‌లో వినిపిస్తున్న పుకార్లు ఎలా ఉన్నాయంటే.. ఈ ప్రాజెక్ట్‌లో ప్రకాష్ రాజ్ భాగం కాదని.. స్పిరిట్ నుంచి తప్పుకున్నాడనే వార్త బాగా వైరల్ అవుతోంది. నిజానికి ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. స్క్రిప్ట్‌తో పాటు ఒక సన్నివేశం గురించి ప్రకాష్ రాజ్‌కు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు సెట్స్‌లో తీవ్ర వాదన జరిగిందని.. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే మాట బాగా వైరల్ అయ్యింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారని.. ఇప్పుడు ఆయన ప్లేస్‌లో కొత్త నటుడిని తీసుకుని మళ్లీ రీ షూట్ చేయాలంటూ టాలీవుడ్‌లో న్యూస్ బాగా వైరల్ అయ్యింది. ఈ విభేదాలు తీవ్రమయ్యాయని.. ఫలితంగా సందీప్ వంగాతో పాటు ప్రభాస్ సినిమాల్లో కూడా ప్రకాష్ రాజ్ నటించే అవకాశం లేదన్నట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.
సెట్‌లో ప్రకాష్ రాజ్ ప్రవర్తన నిర్మాతలకు నచ్చలేదని, అందుకే ఆయనను ప్రాజెక్ట్ నుండి తొలగించే తీవ్రమైన చర్య తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్త పరిశ్రమలో వేగంగా వ్యాపిస్తోంది. ప్రకాష్ రాజ్ వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ముందుగా, దీపికా పదుకొనేను హీరోయిన్‌గా తీసుకున్నారని.. కానీ దర్శకుడితో పనివేళల్లో తేడాలు రావడంతో ఆమె తప్పుకున్నారని నివేదికలు వచ్చాయి. చివరికి ఆ పాత్ర త్రిప్తి దిమ్రీకి దక్కింది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 5, 2027న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read : చంద్రబాబుపై.. బీజేపీ ఎమ్మెల్యే కులం దాడి వెనుక..?
అయితే ఈ వైరల్ న్యూస్‌పై ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ఒక సోషల్ మీడియా పోస్టుతో గాసిప్‌కు చెక్ పెట్టారు. తన వైఖరిని నిస్సందేహంగా స్పష్టం చేశారు. ఆ కథనాలను నిరాధారమైన కల్పిత కథలుగా తోసి పుచ్చారు. అతను పుకారు మిల్లులు అని పిలిచే వారిని లక్ష్యంగా చేసుకున్నారు. “విషపూరితమైన నకిలీ వార్తల వ్యాపారులందరికీ…. స్పిరిట్ ది మూవీలో.. నా సన్నివేశాల షూటింగ్ కూడా ప్రారంభించలేదు. మీరు వాట్సప్ ఫ్యాక్టరీలు కథలను ఊహించండి. ఎదిగి జీవితాన్ని గడపండి”.. అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆయన ప్రకటన ఊహాగానాలను సమర్థవంతంగా ముగించి వాస్తవ స్పష్టతను పునరుద్ధరిస్తుంది.

