Monday, October 27, 2025 10:16 PM
Monday, October 27, 2025 10:16 PM
roots

రిజిస్టర్డ్ పోస్ట్ కు గుడ్ బై.. తపాలా శాఖ కీలక నిర్ణయం..!

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎన్నో ఏళ్ళుగా ఉన్న సర్వీసులు కనుమరుగు అవుతున్నాయి. తాజాగా మరో ఐకానిక్ సర్వీస్ కనుమరుగు అయ్యే దశలో ఉంది. భారత తపాల శాఖ కీలక ప్రకటన చేసింది. తమ రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 50 ఏళ్ళ శకానికి ముగింపు పలికింది. సెప్టెంబర్ 1, 2025 నుండి, తమ కార్యకలాపాలను ఆధునీకరించే లక్ష్యంతో స్పీడ్ పోస్ట్‌ ను అప్డేట్ చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా దశల వారీగా రిజిస్టర్డ్ పోస్ట్ ను తొలగిస్తారు.

Also Read : బిగ్ బాస్ అరెస్టు ఖాయమా..?

50 సంవత్సరాలకు పైగా అత్యంత నమ్మకమైన సర్వీస్ గా దీనికి గుర్తింపు ఉంది. లక్షలాది మంది భారతీయుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉద్యోగుల ఆఫర్ లెటర్ లు, లీగల్ నోటీసులు, ప్రభుత్వ ఉత్తరప్రత్యుత్తరాలు వంటి ముఖ్యమైన పత్రాలను అందించడానికి ఈ సర్వీసును వాడుకోవచ్చు. 2011-12లో 244.4 మిలియన్ల రిజిస్టర్డ్ పోస్ట్ లు పంపగా.. క్రమంగా తగ్గుతూ వచ్చింది. 25% తగ్గి.. 2019-20లో 184.6 మిలియన్లకు తగ్గిందని భారత తపాలా శాఖ ప్రకటించింది. డిజిటల్ గా పత్రాలు పంపడం, ప్రైవేట్ కొరియర్లు, ఇ-కామర్స్ లాజిస్టిక్స్ నుండి పోటీ కారణంగా రిజిస్టర్డ్ పోస్ట్ ఇబ్బంది పడింది.

Also Read : మెగా ఫ్యామిలీకి గడ్డు కాలమే..?

దీనిని స్పీడ్ పోస్ట్ తో విలీనం చేయాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ 1 నాటికి అన్ని శాఖలు, కోర్టులు, విద్యా సంస్థలు, వినియోగదారులు కొత్త వ్యవస్థకు మారాలని పోస్టల్ శాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ సూచించారు. 1986 నుండి పనిచేస్తున్న స్పీడ్ పోస్ట్ కింద సేవలను ఏకీకృతం చేయడం ద్వారా ట్రాకింగ్ ఖచ్చితత్వం, డెలివరీ వేగం వంటి సౌకర్యాలను మెరుగు పరచడానికి అయితే, స్పీడ్ పోస్ట్ కాస్త రేట్ ఎక్కువ. రిజిస్టర్డ్ పోస్ట్ ప్రారంభ రేట్.. 200 గ్రాములకు రూ. 25.96 ప్లస్ రూ. 5 కాగా, స్పీడ్ పోస్ట్ 50 గ్రాముల నుంచి రూ. 41తో ప్రారంభమవుతుంది. అందుకే గ్రామీణ భారతంలో ఎక్కువగా రిజిస్టర్డ్ పోస్ట్ మాత్రమే వాడుతూ ఉంటారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్