గత ప్రభుత్వంలో నోటికి అన్ని విధాలుగా పని చెప్పిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. వరుస ఫిర్యాదులతో… వరుస కేసులు నమోదు కావడంతో రాజకీయాలకు సెలవు ప్రకటించారు పోసాని. ఇక నుండి నా జీవితంలో రాజకీయాలు మాట్లాడను అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. ఎంపీ, ఎమ్మెల్యే కంటే తనకే ఎక్కువగా జగన్ ప్రాధాన్యత ఇచ్చారని… నేను రాజకీయాలు మాట్లాడితే కోపం, తిక్క అనుకుంటారన్నారు.
Also Read : బరితెగించిన నాటి జగన్ సర్కార్.. ఇదిగో మరో ఆధారం
నేను మంచి నాయకులను ఎప్పుడు విమర్శించలేదని తెలిపారు. నరేంద్ర మోడీ, ఇందిరా గాంధీ, నవీన్ పట్నాయక్ గొప్ప నాయకులు వారిని ఎప్పుడూ విమర్శించలేదన్న ఆయన నారా చంద్రబాబు, జగన్ , లోకేష్ వారి గుణగణాలను బట్టి మాత్రమే విమర్శించానని చెప్పుకొచ్చారు. నా మనస్సాక్షి గా, నా తల్లి తండ్రుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ఎవర్ని కావాలని విమర్శించలేదన్నారు. ఒక ఓటర్ గా మాత్రమే నేను ప్రవర్తించానని చెప్పుకొచ్చారు పోసాని. నా కుటుంబంకోసం, నా బిడ్డల కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Also Read : జైస్వాల్ ను టెంప్ట్ చేస్తే చాలా…?
ఇక్కడి నుంచి నేను చచ్చిపోయెంత వరకు రాజకీయాలు మాట్లాడనన్న ఆయన… నా మొఖం నాకు అంద వికారంగా కనబడుతోందన్నారు. జగన్ గారు l love you. నేను ఏం అడిగినా ఇచ్చారని చెప్పుకొచ్చారు పోసాని. చంద్రబాబు నాయుడు గారు మీ కోసం నేను చాలా చేశానని గుర్తు చేసుకున్నారు. అలా అని పోసాని కేసులకు భయపడడు అని స్పష్టం చేసారు. నేను తప్పు చేసి ఉంటే… జైలుకు వెళ్ళడానికి సిద్ధం అని పోసాని ప్రకటించారు. కాగా పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 38 కేసులు నమోదు చేసారు పోలీసులు. మరి పోసాని ప్రకటనతో బాబు సర్కార్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.