రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి.. సినీ రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు. ఇద్దరికీ సినీరంగంలో మంచి పేరుంది. అయితే రాజకీయాల్లో కూడా తమ ముద్ర ఉండాలనే లక్ష్యంతో ఈ ఇద్దరు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీలో చేరారు పోసాని కృష్ణమురళి. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల సమయంలో అడ్డంకులు సృష్టించారనే అక్కసుతో వర్మ కూడా జై జగన్ అనేశారు. వైసీపీకి అనుకూలంగా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేశారు. సెటైరికల్‌గా సినిమాలు తీశారు. అదే సమయంలో పాదయాత్ర, వ్యూహం పేరుతో వైసీపీకి అనుకూలంగా సినిమాలు కూడా తీశారు. వాటికి నాటి వైసీపీ ప్రభుత్వం నుంచి రాయితీ కూడా తీసుకున్నారు.
Also Read: జగన్‌ను ఆడిస్తున్నది ఎవరూ..?
ఇక పోసాని కృష్ణమురళీ కూడా జగన్ సర్కార్‌లో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కించుకున్నారు. ఆ పదవిలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై పోసాని రెచ్చిపోయారు. అత్యంత నీచంగా రాయలేని భాషలో బూతులతో వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓడిన తర్వాత ఇద్దరిలో అరెస్టు భయం పట్టుకుంది. ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇకపై రాజకీయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయమన్నారు. పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పేశారు. అయినా సరే.. కూటమి నేతలు, కార్యకర్తలు మాత్రం వారిని వదల్లేదు. గతంలో చేసిన వ్యాఖ్యలపై పలు చోట్ల పోలీస్ కేసులు పెట్టారు. అప్పటి వరకు ఒకేలా వ్యవహరించిన వర్మ, పోసాని.. అప్పటి నుంచి మారిపోయారు. వర్మ తన మార్కు తెలివి ప్రదర్శించారు.
Also Read: ఫోటోలు అక్కర్లా.. రేవంత్ మార్క్ రియాక్షన్
సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌పై చేసిన కామెంట్లు, పోస్టులను డిలీట్ చేశారు. అరెస్టు తప్పదని భయపడిన వర్మ… ముందుగానే హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అదే సమయంలో తనపై ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న అన్ని కేసులను ఒకే కేసుగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఒంగోలులో పోలీసు విచారణకు హాజరయ్యారు. కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో వర్మ అరెస్టు జరగలేదు. దీంతో వర్మ సేఫ్ జోన్‌లో ఉన్నాడు. ఇదే సమయంలో పోసాని కృష్ణమురళీని ఏపీ పోలీసులు ఆడుకుంటున్నారు. అరెస్టు భయంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన పోసాని.. ఇక తన జోలికి రారని ధీమాగా ఉన్న సమయంలో శివరాత్రి రోజు రాత్రి పోసానిని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: బాబు నిర్ణయంతో ఆ నేతల్లో భయం..!
ఇక అప్పటి నుంచి ఒకటే మ్యూజిక్… అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తిప్పిన పోలీస్ స్టేషన్ తిప్పకుండా పోసాని పోలీసులు తిప్పుతునే ఉన్నారు. ఈ రోజు పాలకొండలో ఉంటే… రేపు నరసరావుపేట… ఎల్లుండి బాపట్ల… ఇలా అన్ని జిల్లాలు తిప్పుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ… మరోకేసులో పీటీ వారెంట్ వేసి అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో “నేను ఆత్మహత్య చేసుకుంటా” అంటూ పోసాని బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలే పోసానిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. “వర్మకు ఉన్న తెలివి లేకుండా పోయిందా నీకు” అంటూ విమర్శలు చేస్తున్నారు. జగన్ అండ చూసుకుని రెచ్చిపోయావు.. ఇప్పుడు తిరుగుతున్నావంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందమంది అయితే పాపం పోసాని.. అంటు నిట్టూరుస్తున్నారు కూడా.