Friday, September 12, 2025 05:21 PM
Friday, September 12, 2025 05:21 PM
roots

అలా వెళ్ళడానికి ఏమాత్రం సిగ్గుపడను

ఒకానొక సమయంలో సౌత్ సినీ ఇండస్ట్రీలోనూ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోను ఓ వెలుగు వెలిగిన నటి పూజా హెగ్డే. ఇలా కెరీర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడిపిన ఈ పొడుగు కాళ్ళ ముద్దుగుమ్మను వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడాయి. ఇలా వరుస ఫ్లాప్ సినిమాలతో అవకాశాలు లేక పూజా హెగ్డే పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అయితే అవకాశాలు లేని సమయంలో ఫిట్నెస్ పై దృష్టి సారించిన పూజ, ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటూ తిరిగి కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు.

Also Read : ఏఐతో నెలకు లక్షన్నర సంపాదిస్తున్నాడు

ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ లతో పూజా హెగ్డే బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్ గురించి, కెరీర్ పరంగా తనకు ఎదురైన సవాళ్ల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇటీవల తాను ఒక తమిళ సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లగా.. తనని ఆ సినిమాలో రిజెక్ట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రిజెక్ట్ చేయడానికి కారణం ఆ పాత్రకు తన వయస్సు సరిపోదని, తన కంటే పెద్ద వయసు ఉన్న వారిని తీసుకోవాలని తనని రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇలా తాను ఆడిషన్స్ కి వెళ్లడం వల్ల నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా ఉంటుందని తెలిపారు.

Also Read : సినిమాని చంపెయ్యకండి.. మీడియాపై నిర్మాత ఫైర్

నేను ఆడిషన్స్ కి వెళ్ళటం వల్ల ఎలాంటి పాత్రలనైనా చేయగలను అనే నమ్మకాన్ని నిర్మాతలకి కల్పించినట్టు అవుతుందని తెలిపారు. ఆడిషన్స్‌కు వెళ్లేందుకు అహంకారం ప్రదర్శించనని… కష్టపడి పని చేయటానికి ఏమాత్రం వెనకాడనని తెలిపింది. ఏదేమైనా ఒక నటిగా ఆడిషన్స్‌కు వెళ్లడానికి తాను ఎప్పుడు సిగ్గుపడను అంటూ పూజ హెగ్డే చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తోన్న రెట్రో సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే.

Also Read : హిట్ 3 క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్ట్..?

టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ ‘కూలీ’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘జైలర్’ మూవీలో తమన్నాతో చేసిన ‘కావాలయ్యా’ పాట తరహాలో స్టోరీలో భాగంగా వచ్చేలా ఒక ప్రత్యేక గీతంలో పూజ హెగ్డే కనిపించనుంది. పూజా హెగ్డేకి గతంలో ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ సరసన ‘జిగేల్ రాణి’ అనే పాటలో ఆడిపాడింది. ఆ తర్వాత ‘ఎఫ్ 3’ మూవీలో ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాలా’ అనే సాంగ్ లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. మళ్ళీ ఇన్నాళ్లకు ‘కూలీ’లో రజనీకాంత్ తో కలిసి స్టెప్పులేయనుంది. పూజా ప్రస్తుతం ‘జన నాయగన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. అలానే ‘కాంచన 4’ మూవీలో భాగం అవుతోందని సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్