Friday, September 12, 2025 03:29 PM
Friday, September 12, 2025 03:29 PM
roots

బోండా ఉమా పైకి దూసుకొస్తున్న గులకరాయి

ఏపీలో ఇప్పుడు గులక రాళ్ల రాజకీయం నడుస్తోంది. సీఎం జగన్ పై గులకరాయితో దాడి జరిగిన తర్వాత.. ఏపీలో ఇదో రాజకీయ అంశంగా మారిపోయింది. అధికార విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే ఈ గులకరాయి దాడి అటు తిరిగి ఇటు తిరిగి.. టిడిపి సీనియర్ నేత బొండా ఉమాపై పడేట్లు కనిపిస్తుంది. ఈ ఘటనకు పాల్పడింది ఐదుగురు యువకులని.. వారంతా మైనర్ లేనని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు బోండా ఉమా అనుచరుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల నుంచి స్టేట్మెంట్లు తీసుకొని ఉమా పై కేసుల నమోదుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో పోలీసులే ఈ ప్లాన్ అమలు చేస్తున్నట్లు టిడిపి నేతలు అనుమానిస్తున్నారు.

వాస్తవానికి బోండా ఉమాను ఎప్పుడో టార్గెట్ చేశారు. పల్నాడులో ఆయనపై దాడి కూడా జరిగిన సంగతి ప్రజలకు ఇంకా గుంటుందే ఉంటుంది. పోలీస్ కేసులకు సంబంధించి ఇప్పటివరకు ఎక్కడా ఆయన చిక్కలేదు. ఇప్పుడు ఈ గులకరాయి దాడి ఎపిసోడ్ ని తీసుకుని అరెస్టు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు వడ్డేర బస్తీలో పిల్లలను పావులుగా వాడుకుంటున్నారు అని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. వారిచ్చిన స్టేట్మెంట్ తో బోండా ఉమా అనుచురుడిపై పడ్డారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇప్పుడు బోండా ఉమా పై చర్యలకు ఉపక్రమించనున్నారు అని తెలుస్తుంది. అయితే ఈ బలవంతపు స్టేట్మెంట్లు న్యాయస్థానంలో పనిచేయవు. కానీ ఎన్నికల ముంగిట ఆయన్ను ప్రచారంలో పాల్గొనకుండా ఇబ్బంది పెట్టాలనుకుంటున్న తరుణంలో.. ఉమాను అరెస్ట్ చేసే చాన్స్ కనిపిస్తోంది. అయితే ఇది కోర్టులో నిలబడే అవకాశం లేదు కానీ.. అరెస్టు చేసి జైల్లో ఉంచడం ద్వారా బోండా ఉమా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఏపీలో యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వం మాటే చెల్లుబాటు అవుతోంది. ఇప్పటికీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చాలా మంది అధికారులు విపక్షాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు వారికి కనిపించడం లేదు. కెసిఆర్ కూడా ఇదే మాదిరిగా వ్యవహరించారు. ఆయనకు చాలా మంది అధికారులు సహకరించారు. ఇప్పుడు వారంతా బాధపడుతున్నారు. ఏపీలో కూడా అటువంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అధికారులు జాగ్రత్త పడుకుంటే మూల్యం తప్పదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్