ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ గోదావరి వరదలకు దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాని నిర్మాణం పై మళ్ళీ దృష్టి సారించింది. ఇక విదేశీ నిపుణుల సహాయంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. స్వదేశీ, విదేశీ నిపుణులతో పాటుగా వివిధ పరిశోధన సంస్థల ప్రతినిధుల మధ్య దీనికి సంబంధించి తాజాగా డిస్కషన్ జరిగింది. ఆఫ్రి డిజైన్ కన్సల్టెన్సీ, తిరుపతి ఐఐటి విదేశీ నిపుణులు.. టి 16 సమ్మేళనాన్ని ప్రతిపాదించగా సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ప్రతినిధులు మాత్రం టి 5 సమ్మేళనం పై ఆసక్తి చూపించారు.
Also Read : కార్యకర్తలతో జగనన్న.. మళ్లీ వాయిదా..!
గురువారం రాత్రి నిర్వహించిన సమావేశంలో విదేశీ నిపుణులు… ఆయా దేశాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యారు. పోలవరం అథారిటీ సభ్య కార్యదర్శి రఘురాం, చీఫ్ ఇంజనీర్ రాజకుమార్ కేంద్ర జల సంఘం డిజైన్ అండ్ రీసెర్చ్ సభ్యులు డైరెక్టర్లు పలువురు ఈ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. రెండు కాంక్రీట్ సమ్మేళనాలు అనువు గానే ఉన్నాయని ఒక అభిప్రాయానికి వచ్చేసారు. అయితే విదేశీ నిపుణులు మాత్రం టీ 16 వైపు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే దానికి సంబంధించి వారి అభిప్రాయాలను కూడా ఇక్కడ పంచుకున్నారు.
Also Read :తప్పంతా మీదే.. అధికారులపై బాబు ఫైర్…!
అయితే సి ఎస్ ఎం ఆర్ ఎస్ నిపుణులు మినహా మిగిలిన వారంతా టి 16 మంచిది అనే ఒపినియన్ కు వచ్చారు. దీంతో డయాఫ్రం వాల్ ట్రెంఛి స్థిరత్వం పై కూడా వీరి మధ్య చర్చ జరిగింది. అటు తిరుపతి ఐఐటీ కూడా ఈ విషయంలో గట్టిగానే తమ అభిప్రాయాలను వినిపించింది. గతంలో వాల్ నిర్మాణానికి వాడిన సమ్మేళనంతో పాటుగా మరో రెండు రకాలపై రీసెర్చ్ చేసిన రిజల్ట్స్ ను విదేశీ నిపుణులకు పంపించారు. అటు కేంద్ర సంస్థలు, సి డబ్ల్యూ సి తో పాటుగా పోలవరం అధారిటికి కూడా సమర్పించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొని పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. 2026 చివరి నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది.