జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఎటువంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు ఇప్పటికే సైనిక బలగాలను సిద్ధం చేసింది భారత్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు ఇస్తున్నారు. పాకిస్తాన్ విషయంలో భవిష్యత్తులో దౌత్యపరమైన సంబంధాలు లేకుండా ఉండేందుకు భారత్ కీలక అడుగులు వేస్తోంది. భారత్ నుంచి రవాణా మార్గాలను అన్ని వైపులా మూసేసింది కేంద్రం.
Also Read : మోడీకి మేమున్నాం.. అమెరికా ఆసక్తికర కామెంట్స్
ఇక పాకిస్తాన్ కూడా భారత విషయంలో అదే స్థాయిలో స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే గగనతల మార్గాన్ని మూసివేసిన పాకిస్తాన్.. భారత్ ఏ దాడికి దిగిన ఎదుర్కొనేందుకు క్షిపణి ప్రయోగాలను చేస్తోంది. తాజాగా 450 కిలోమీటర్ల రేంజ్ కలిగినక్షిపణి ని పాకిస్తాన్ ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇక భారత్ కు మిత్ర దేశాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఇక తాజాగా పాకిస్తాన్ విషయంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
Also Read : టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ ఇల్లు గుర్తించిన నేషనల్ మీడియా
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు నరేంద్ర మోడీ. ఉగ్రవాదులను మాత్రమే కాదని ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారిని కూడా అంతం చేస్తామని హెచ్చరించారు మోడీ. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి దేశంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. అమాయకుల ప్రాణాలను తీసుకునే ఉగ్రవాదుల విషయంలో భారత ప్రభుత్వ వైఖరి మరింత కఠినంగా ఉండబోతుందంటూ ఆయన హెచ్చరించారు. ఇక ఇదిలా ఉంటే భారత్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లే.. పార్సిల్ సర్వీస్ లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చే పార్సిల్స్ కూడా అనుమతించే అవకాశం లేదని స్పష్టం చేసింది.