జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో, బుధవారం భారత ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పాక్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న భారత్.. ఇప్పుడు మరింత కఠినంగా అడుగులు వేస్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని నిరవధికంగా నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అట్టారి-వాఘా సరిహద్దులోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను వెంటనే మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలపై మోడీ సర్కార్ నిర్ణయాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
Also Read : నాకే పాపం తెలియదు.. పీఎస్ఆర్ ఆవేదన
సింధూ నదీ నుంచి ఏటా 39 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు భారత్ నుంచి పాకిస్తాన్ లోకి వెళ్తోంది. ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు దేశాల మధ్య నదీ జలాల భాగస్వామ్యాన్ని నియంత్రించే ఈ ఒప్పందం రద్దు అయింది. సార్క్ వీసాను కూడా రద్దు చేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది. దీనితో ఆ దేశ ప్రజలు మన దేశంలోకి అడుగు పెట్టకుండా నిషేధం విధించారు. గతంలో జారీ చేసిన అన్ని వీసాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు దేశంలో ఉన్న వారు.. తిరిగి 48 గంటలలో పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉంటుంది.
Also Read : బీజేపీకే రాజ్యసభ.. లోకల్ కాదు నాన్ లోకల్
ఇక పాకిస్తాన్ హైకమిషన్‌లోని రక్షణ, నావికాదళం, వైమానిక సలహాదారులను తిరిగి పాకిస్తాన్ వెళ్లాలని ఆదేశించారు. వారం రోజుల్లో వాళ్ళు దేశం విడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుండి తన సొంత రక్షణ, నావికాదళం, వైమానిక అధికారులను కూడా భారత్ ఉపసంహరించుకుంటుంది. న్యూఢిల్లీలో దౌత్యపరమైన సంబంధాల కోసం అధికారుల సంఖ్యను.. 30 మందికి తగ్గించాలని, ప్రస్తుతం ఉన్న 55 మంది కార్యకలాపాల సామర్థ్యాన్ని తగ్గించాలని.. భారత్ కు అల్టిమేటం జారీ చేసింది. ఇక పాకిస్తాన్ తో భవిష్యత్తులో ఏ విధమైన క్రికెట్ మ్యాచ్ లు ఆడకుండా నిషేధం విధించాలని ఐసీసిని కోరింది భారత్.