ఐపీఎల్ సీజన్ సగానికి పైగా పూర్తి కావడంతో.. అంతర్జాతీయ మ్యాచులపై బోర్డ్ ఫోకస్ పెడుతోంది. వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటన ఉన్న నేపథ్యంలో.. జట్టు ఎంపికపై సెలక్షన్ కమిటీ కసరత్తు చేస్తుంది. ఆస్ట్రేలియా పర్యటన లోపాలను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేయనున్నారు. మిడిల్ ఆర్డర్లో సీనియర్ ఆటగాళ్లకు అవకాశం కల్పించే దిశగా బోర్డు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ మైదానాల్లో మంచి రికార్డు ఉన్న సీనియర్ బాట్స్మన్ రహానే తిరిగి జట్టులో చేరే అవకాశాలు కనబడుతున్నాయి.
Also Read :టీమిండియాకు మరో సచిన్ దొరికినట్లేనా..!
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి రహానే మంచి ప్రదర్శనలు చేస్తున్నాడు. కొత్త బంతితో అయినా పాత బంతితో అయినా స్వింగ్ ను కంట్రోల్ చేస్తూ పరుగులు రాబడుతూ ఉంటాడు. ఇక ఇంగ్లాండ్ కౌంటి మ్యాచులలో ఆడిన అనుభవం ఉన్న యువ ఆటగాడు సాయి సుదర్శన్ జాతీయ జట్టులోకి రావడానికి మార్గం సుగుమం అయింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో అతను నిలకడగా రాణిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ లో అయినా టాపార్డర్ అయినా ఆడగలిగే సత్తా ఉన్న ప్లేయర్ సాయి సుదర్శన్.
Also Read :రాహుల్ సెలెబ్రేషన్ గూస్ బంప్స్.. మామ సునీల్ శెట్టి ఇంట్రస్టింగ్ కామెంట్స్
దీనితో ఇంగ్లాండు పర్యటనకు సాయి సుదర్శన్ ఎంపిక దాదాపుగా లాంఛనమైంది. సుదర్శన్ తో పాటుగా కరుణ్ నాయక్ కూడా తిరిగి జట్టులోకి అడుగుపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. గత ఏడాది డొమెస్టిక్ సీజన్ లో అతను మెరుగ్గా రాణించాడు. వీళ్ళ ముగ్గురు జట్టులో ఉంటే అదనపు బలమని బోర్డు భావిస్తోంది. మే రెండో వారంలో ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును ఎంపిక చేసి.. కొంతమంది యువ ఆటగాళ్లను సీనియర్ ఆటగాళ్లను ముందుగానే ఇంగ్లాండ్ పంపించాలని భావిస్తున్నారు.




