మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అక్రమాలను బయటకు లాగుతున్నారు అధికారులు. వైసీపీ అధికారంలో లేనప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో కాస్త స్పీడ్ తక్కువగానే ఉన్నా… వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో తక్కువలో తక్కువ రూ.1000 కోట్ల ఆయన అక్రమంగా సంపాదించాడు అని అధికారులు ఆధారాలు సంపాదించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపై దాడులు చేయించి గ్రామాల నుంచి వెళ్లగొట్టడమే కాకుండా వారి ఆస్తులపై కూడా కన్నేశారు పిన్నెల్లి.
Also Read : గులాబీ అరెస్ట్ వ్యూహం.. రేవంత్ ఉచ్చులో పడుతున్నారా..?
దుర్గి, వెల్దుర్తి మండలాల్లో పలు హత్యలకు సంబంధించి ఆయన అనుచరులపై ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అప్పట్లో కేసులు కూడా నమోదు చేయలేని పరిస్థితిలో పోలీసులను అడ్డం పెట్టుకున్నారని పోలీసులు గుర్తించారు. వెల్దుర్తి మండలంలో చంద్రయ్య, దుర్గి మండలంలో జల్లయ్య హత్యలు పిన్నెల్లి వర్గం చేసినవే. పిన్నెల్లి అరాచకాలను ప్రశ్నించేందుకు వచ్చిన టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమాలపై తురకా కిషోర్ తో పిన్నెల్లి దాడి చేయించారు. ఇప్పుడు ఈ కేసులో కీలక సాక్ష్యాలను, ఆధారాలను అధికారులు సేకరించ్చారు.
Also Read : జగన్ కి వాసిరెడ్డి పద్మ సంచలన సలహా
మాచర్ల పట్టణంలో టీడీపీ దివంగత నేత వీరమాచినేని సుభాష్ చంద్రబోస్ కు చెందిన 10 సెంట్ల స్థలంలో గల ఇల్లు, పెట్రోలు బంకు, బంకు సమీపంలోని స్థలాలు, నెహ్రూనగర్‌లోని ఎకరం స్థలానికి అక్రమ దస్తావేజులు పుట్టించి… వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కొన్నింటిపై లోన్స్ కూడా తీసుకున్నారట పిన్నెల్లి. వీటి విలువ సుమారు రూ.10 కోట్ల పైనే ఉంటుందని గుర్తించారు. రింగురోడ్డులోని టీడీపీ నేత నిమ్మగడ్డ వాసుకు చెందిన హెచ్‌పీ పెట్రోల్ బంకును దౌర్జన్యంగా ఆక్రమించిన విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు.
Also Read : ఆ నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసే నాథుడే కరువు…!
కొత్తపల్లి జంక్షన్, స్టేడియం, రాయవరం జంక్షన్, వినాయకుని గుట్ట తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేయించి విక్రయించారు పిన్నెల్లి బ్రదర్స్. మాచర్ల మండలం విజయపురిసౌత్‌లో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని దస్తావేజులు పుట్టించి కాజేసిన వెనుక… పిన్నెల్లి బ్రదర్స్ కు ఓ వైసీపీ అగ్ర నేత అండదండలు అందించారు. వెల్దుర్తి మండలంలో 500 ఎకరాలు, దుర్గి మండలం గజాపురం సమీపంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని పిన్నెల్లి బ్రదర్స్… రెవెన్యూ అధికారులతో కలిసి దోచినట్టు గుర్తించారు. బియ్యం, మద్యం, ఇసుక, గ్రానైట్, జగనన్న ఇళ్ల స్థలాలకు భూములు కొనుగోలు అన్నీ కూడా పిన్నెల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఇక కాంట్రాక్టర్ లు టెండర్ వేయాలి అంటే 30 శాతం కమీషన్ పిన్నెల్లి బ్రదర్స్ కు ఇవ్వాల్సిందే అని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్స ను పోలీసులు విచారించే అవకాశం కనపడుతోంది.