పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఐదేళ్ల క్రితం మొదలైన హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం ఆ తర్వాత ప్రభుత్వంలో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూనే ఉంది. ఈ సినిమాతోనే బ్రో, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి సినిమాలను సైన్ చేసి కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా విషయంలో మాత్రం ఇంకా ఆలస్యం చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నారు.
Also Read : పెద్దిరెడ్డికి దండం పెట్టిన చిత్తూరు వైసీపీ
ఇక ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్స్ తీసుకొచ్చే సినిమాపై హైప్ పెంచాలని మేకర్స్ కూడా రెడీ అవుతున్నారు. అయితే రీసెంట్ గా వస్తున్న కొన్ని అప్డేట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ బిజీగా మారిపోయారట. ఈ సినిమా షూటింగ్ కు పవన్ కళ్యాణ్ మరో నాలుగు రోజులు పాటు డేట్స్ ఇవ్వాల్సి ఉంది. నాలుగు రోజులు డేట్స్ ఇస్తే ఎలాగైనా కంప్లీట్ చేస్తానని జ్యోతి కృష్ణ పవన్ కళ్యాణ్ కు ప్రామిస్ చేశారు. అయినా సరే పవన్ మాత్రం బిజీగా ఉండటంతో షూటింగ్ ఇంకా లేట్ అవుతుంది.
Also Read : కృష్ణా జిల్లాలో కూలుతున్న వైసిపి కోట
ఈ డేట్స్ ఇచ్చేస్తే పవన్ పోర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే అని టాక్. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తేనే సినిమా అనుకున్న టైం కు రిలీజ్ చేయడం సాధ్యమవుతుందని లేదంటే మళ్లీ వాయిదా పడటం ఖాయం అని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో ఓజీ అనే సినిమా ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ లో కూడా త్వరలో పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది. కానీ దానికంటే ముందు హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంది.

