ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు అనే వార్త సంచలనంగా మారింది. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ గాయపడినట్టు జాతీయ మీడియా పేర్కొంది. మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగగా… మీడియా కథనాల ప్రకారం, ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు మరియు కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. పొగ పీల్చడంతో అతని ఊపిరితిత్తులలోకి చేరుకోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Also Read : రజనీని కమ్మేస్తున్న కేసుల వల
ప్రస్తుతం సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అక్కడి మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మంగళవారం సింగపూర్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆయన మన్యం జిల్లాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. డుంబ్రిగూడ మండలం కురిడిలోని ఆలయాన్ని సందర్శించిన అనంతరం అక్కడి స్థానికులతో పవన్ స్వయంగా మాట్లాడనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం పవన్ శంకుస్థాపన చేయనున్నారు.
Also Read : జగన్ హెలికాప్టర్ దిగకుండా తిప్పి పంపుతా: పరిటాల సునీత
ఇదిలా ఉండగా, మంగళవారం ఉదయం పవన్ కళ్యాణ్ మరో మూడు రోజులు విశాఖపట్నంలోనే ఉంటానని ప్రకటించారు. బుధవారం సాయంత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను సందర్శిస్తానని కూడా తెలిపారు. అయితే, ఈ దుర్ఘటన కారణంగా, అల్లూరి జిల్లా పర్యటన తర్వాత ఆయన సింగపూర్‌కు బయలుదేరుతారు. కాగా మార్క్ శంకర్ అక్టోబర్ 10, 2017న పవన్ కళ్యాణ్, అతని భార్య అన్నా లెజ్నెవా దంపతులకు జన్మించాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఈ వార్త తెలియడంతో పవన్ అభిమానులు పూజలు మొదలుపెట్టారు.





Good