ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు చెప్తే అధికారులు వణికిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ అధికారిపై గురి పెడతారో అర్థం కాక చివరకు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల్లో కూడా ఒక రకమైన తెలియని భయం కనబడుతోంది. రెండు నెలల క్రితం వైసీపీ కార్యకర్తకు ఒక ఎస్పీ సహకరిస్తున్నారు అనే కారణంతో ఆయన పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు క్యాబినెట్ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడంతో సదరు ఎస్పీని బదిలీ చేశారు చంద్రబాబు. ఆ తర్వాత కాకినాడ పర్యటనకు వెళ్లి అధికారులకు చమటలు పట్టించారు పవన్.
Also Read: ప్రభుత్వానికి కొత్త చిక్కుగా సరస్వతి వ్యవహారం…!
పౌర సరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, అలాగే పోలీసులు అక్రమ రేషన్ బియ్యం ఉందా వ్యవహారంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలు సాక్ష్యాలను కూడా పవన్ కళ్యాణ్ సమర్పించినట్లుగా తెలిసింది. ఇక తాజాగా కలెక్టర్లకు కాన్ఫరెన్స్ సందర్భంగా కాకినాడ ఎస్పీ పై పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పలు సాక్షాలను సమర్పించి అనేక ఫిర్యాదులు చేశారు. అలాగే కాకినాడ కలెక్టర్ పై కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
Also Read: వేరే నాయకులు లేరా…? నాగబాబుకే ఎందుకు…?
అక్రమ రేషన్ బియ్యం వ్యవహారంలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల సహకారం ఉంది అనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వద్ద పవన్ కళ్యాణ్ వ్యక్తం చేయడంతో ఇప్పుడు కాకినాడలో కీలక అధికారులను బదిలీ చేసే అవకాశం కనబడుతోంది. ఏళ్ల తరబడి అక్కడ పాతుకుపోయిన అధికారులే రేషన్ బియ్యం దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించడంతో పలువురు అధికారులను మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.